విరాట్ కోహ్లీ బెంగళూరులో ఇరగదీశాడు - మరో గొప్ప రికార్డు ఏంటో తెలుసా?
Virat Kohli records: బెంగళూరులో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో భారత ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Virat Kohli records : బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో భారత క్రికెట్ జట్టు, న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో అవమానకర ప్రదర్శన చేసిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత ప్లేయర్లు మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తొలి టెస్టు మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో భారత ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
టెస్టుల్లో 9000 పరుగులు పూర్తి చేసిన విరాట్ కోహ్లీ
ఈ మ్యాచ్ లో రన్ మిషన్ విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా కూడా తెరవలేకపోయాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో ఫామ్ ను అందుకుంటూ హాఫ్ సెంచరీ బాదాడు. తన 53 పరుగుల ఇన్నింగ్స్ తో తన పేరిట మరో ప్రత్యేక రికార్డు సృష్టించాడు. ఈ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ తో కోహ్లీ టెస్టులో 9000 పరుగులు పూర్తయ్యాయి. ఈ ఘనత సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లి 116వ టెస్టులో 197వ ఇన్నింగ్స్‌లో 9000 టెస్టు పరుగులు పూర్తి చేశాడు.
టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును కలిగి ఉన్నాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. సచిన్ 200 టెస్టుల్లో 329 ఇన్నింగ్స్‌ల్లో 15921 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 68 అర్ధ సెంచరీలు, 51 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ రెండో స్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ 163 టెస్టుల్లో 284 ఇన్నింగ్స్‌ల్లో 13265 పరుగులు చేశాడు. 125 టెస్టుల్లో 214 ఇన్నింగ్స్‌లలో 10122 పరుగులు చేసిన సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
టెస్టులో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 భారత ఆటగాళ్లు వీరే
సచిన్ టెండూల్కర్: 15921 పరుగులు
రాహుల్ ద్రవిడ్: 13265 పరుగులు
సునీల్ గవాస్కర్: 10122 పరుగులు
విరాట్ కోహ్లీ: 9000* పరుగులు
వీవీఎస్ లక్ష్మణ్: 8781 పరుగులు
వీరేంద్ర సెహ్వాగ్ : 8503
సౌరవ్ గంగూలీ : 7212
ఛతేశ్వర్ పుజారా : 7195
డీబీ వెంగ్‌సర్కార్ : 6868
ఎం అజారుద్దీన్ : 6215
9000 పరుగుల కోసం కోహ్లీ 197 ఇన్నింగ్స్‌లు
విరాట్ కోహ్లీ 197 ఇన్నింగ్స్‌లను ఆడి 9000 పరుగులను పూర్తి చేశాడు. అతని కంటే ముందు, రాహుల్ ద్రవిడ్ 176 ఇన్నింగ్స్‌లలో 9000 టెస్ట్ పరుగులు పూర్తి చేసారు. సచిన్ టెండూల్కర్ 179 ఇన్నింగ్స్‌లలో 9000 పరుగులను అందుకోగా, సునీల్ గవాస్కర్ 192 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ 98 ఇన్నింగ్స్‌ల్లో 4500 టెస్టు పరుగులు పూర్తి చేశాడు.
అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 9000 టెస్టు పరుగులు చేసిన భారతీయులు
176 ఇన్నింగ్స్‌లు- రాహుల్ ద్రవిడ్
179 ఇన్నింగ్స్‌లు- సచిన్ టెండూల్కర్
192 ఇన్నింగ్స్‌లు - సునీల్ గవాస్కర్
197 ఇన్నింగ్స్- విరాట్ కోహ్లీ
Cricketer virat kohli
తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన విరాట్
బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఖాతా కూడా తెరవలేదు. అతను 9 బంతులు ఎదుర్కొన్నాడు. జీరో పరుగులతో పెవిలియన్ చేరుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి 102 బంతుల్లో 70 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్ కోహ్లీ 8 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.
మూడో రోజు ఆట లో భారత్ మంచి ప్రదర్శన చేసింది. వికెట్లు కాపాడుకుంటూనే అటాకింగ్ బ్యాటింగ్ ను మొదలుపెట్టింది. ప్రస్తుతం మ్యాచ్ ను గమనిస్తే 231/3 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. యశస్వి జైస్వాల్ 35 పరుగులు, విరాట్ కోహ్లీ 70 పరుగులు, రోహిత్ శర్మ 52 పరుగులు చేసి ఔట్ అయ్యారు. 70* పరుగులతో సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో ఉన్నాడు. ఇంకా భారత జట్టు 125 పరుగులు వెనుకబడి ఉంది. నాలుగో రోజు భారత జట్టు ఆట ఎలా సాగుతుందనేది ఆసక్తిని పెంచుతోంది.