విరాట్ కోహ్లీ రేంజ్ వేరు! రొనాల్డో, రోజర్ ఫెదరర్, టైగర్ వుడ్స్, మెస్సీలతో సమానం.. - ఏబీ డివిల్లియర్స్...
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ మధ్య స్నేహం గురించి క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ తెలిసిందే. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరుపున ఆడిన ఈ ఇద్దరూ, క్రికెట్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిపోయారు... వెస్టిండీస్ టూర్‌లో 76వ అంతర్జాతీయ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు ఏబీ డివిల్లియర్స్..
‘విరాట్ కోహ్లీ ఓ హీరో. అతను కొన్ని కోట్ల మందికి స్ఫూర్తి. అతనో లెజెండ్. విరాట్ ఆడుతుంటే చూడడం నాకెంతో ఇష్టం.. కోహ్లీ, స్నేహితుడిగా నా అదృష్టం...
76 అంతర్జాతీయ సెంచరీలు చేయడం, అంతర్జాతీయ క్రికెట్‌లో 50+ యావరేజ్, ఆల్‌టైం ఐదో హైయెస్ట్ రన్ స్కోరర్... అసాధారణమైన రికార్డులు విరాట్ కోహ్లీ సొంతం...
Kohli ABD
విరాట్ కోహ్లీ ఇతరులకు సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. నేను స్వయంగా విరాట్‌లో ఈ లక్షణాన్ని చూశాను. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020 సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు ఏడుగురితో చాలా సేపు మాట్లాడాడు విరాట్ కోహ్లీ..
20 ఓవర్లు ఫీల్డింగ్, బ్యాటింగ్ చేసిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ, అంతసేపు ఓపిగ్గా మాట్లాడడం చూసి ఆశ్చర్యమేసింది. జోషువా డి సిల్వ తల్లితో విరాట్ కోహ్లీ మాట్లాడిన మూమెంట్స్ చూసి ముచ్ఛటేసింది..
Virat Kohli
నా ఉద్దేశంలో విరాట్ కోహ్లీ... టైగర్ వుడ్స్, క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ, నోవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్, లూయిస్ హామిల్టన్.. కోవకు చెందినవాడు. టీమ్ కోసం బెస్ట్ ఇవ్వడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు..
విరాట్ కోహ్లీ ఫైటింగ్ స్పిరిట్ అద్భుతం. అందుకే విరాట్ కోహ్లీ బెస్ట్ ప్లేయర్లలో బెస్ట్‌గా పోటీపడుతున్నాడు... ఈ తరం చూసిన బెస్ట్ అథ్లెట్ విరాట్ కోహ్లీ...’ అంటూ కామెంట్ చేశాడు ఏబీ డివిల్లియర్స్..