- Home
- Sports
- Cricket
- కోహ్లీ ఓ సూపర్ స్టార్, అతనికోసం వాళ్లు ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు... షేన్ వార్న్ కామెంట్స్...
కోహ్లీ ఓ సూపర్ స్టార్, అతనికోసం వాళ్లు ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు... షేన్ వార్న్ కామెంట్స్...
ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ టైటిల్ సాధించలేదనే విమర్శలు వెంటాడుతూనే ఉన్నా, టెస్టుల్లో మాత్రం విరాట్ కోహ్లీ, గ్రేట్ ఇండియన్ టెస్టు కెప్టెన్‌గా అవతరించేశాడు. టెస్టుల్లో అత్యధిక విజయాలు మాత్రమే కాదు, విదేశాల్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా టాప్‌లో నిలిచిన విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్...

బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్‌పై ఆఖరి రోజు ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేయడం అసాధ్యమని భావించారు క్రికెట్ పండితులు. ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేకుండా బరిలో దిగడం చాలా పెద్ద వ్యూహాత్మిక తప్పిదమని అన్నారు...
అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, నాలుగో టెస్టులో టీమిండియా అద్భుతం చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లు ఫెయిల్ అయిన చోట, భారత బౌలర్లు అదరగొట్టారు. ఫలితం ఓవల్ టెస్టులో 50 ఏళ్ల తర్వాత టీమిండియా చారిత్రక విజయం...
‘ఈ విజయం తర్వాత ‘థ్యాంక్యూ విరాట్ కోహ్లీ’ అని చెప్పాల్సిందే. ఎందుకంటే కోహ్లీ వల్లే టీమిండియా ఈ రేంజ్‌లో పర్ఫామ్ చేస్తోంది... అతనికి టెస్టు క్రికెట్ అంటే ఇష్టం...
వన్డే, టీ20ల కంటే టెస్టు క్రికెట్‌కే విరాట్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. టెస్టు టీమ్‌ను నెం.1 గా నిలబెట్టాడు. ఇప్పుడు వరల్డ్ క్రికెట్‌లో టీమిండియా ఓ పవర్ హౌస్. ఆ జట్టులో విరాట్ కోహ్లీ లాంటి ఓ క్రికెట్ సూపర్ స్టార్ ఉన్నాడు...
టీమిండియా, భారత్‌లోని స్పిన్ పిచ్‌లపై గెలిచింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌన్సింగ్ ట్రాక్‌లపై విజయాలను అందుకుంది. ఇంగ్లాండ్‌లోని సీమ్ పరిస్థితుల్లోనూ గెలిచారు... ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించగలమని నిరూపించారు...
ఈ విజయాల వెనక విరాట్ కోహ్లీ కచ్ఛితంగా ఉంటాడు. ఎందుకంటే జట్టులో ప్రతీ ఒక్కరూ అతని కోసం ఏం చేయడానికైనా రెఢీగా ఉంటారు. ఏ జట్టుకైనా అదే కావాలి... అలాగే జట్టుకి ఎక్కడైనా గెలవగలమనే నమ్మకాన్ని విరాట్ కోహ్లీ ఇచ్చాడు...
విరాట్ కోహ్లీ ఉన్నంతకాలం టెస్టులకు ఆదరణ ఉంటుంది. అందుకే విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో సాధ్యమైనంత ఎక్కువ కాలం టెస్టుల్లో కొనసాగాలని నేను కోరుకుంటున్నా...
మరో అద్వితీయ విజయాన్ని అందుకున్న విరాట్ కోహ్లీ, భారత జట్టుకి అభినందనలు. గత 12 నెలల కాలంలో మీ సమిష్టి ఆటతీరు అద్భుతంగా ఉంది. బెస్ట్ టీమ్ ఇన్ ది వరల్డ్... లాంగ్ లివ్ టెస్టు క్రికెట్...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్.