విరాట్ కోహ్లీని గ్రేటెస్ట్ అని ఒప్పుకోలేకపోతే, క్రికెట్ చూడడం మానేయండి... - రవిశాస్త్రి
అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసినప్పటి నుంచి సచిన్ టెండూల్కర్ రికార్డులే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆడిన ఇన్నింగ్స్‌తో ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...
Virat Kohli
2 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో కెఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 165 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పాడు విరాట్ కోహ్లీ. ఈ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా 4 వికెట్ల తేడాతో సునాయాస విజయం అందుకుంది..
ఈ మ్యాచ్ తర్వాత ఐసీసీ, కొందరు మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లను ‘విరాట్ కోహ్లీ ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానాలు కోరింది. దీనికి ఆసక్తికర సమాధానాలు చెప్పారు క్రికెటర్లు..
‘విరాట్ కోహ్లీ, లెజెండ్ ఆఫ్ ది గేమ్’ అని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సమాధానం ఇవ్వగా, ‘విరాట్, వన్ ఆఫ్ ది గ్రెటెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆల్ టైం’ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సమాధానం ఇచ్చాడు..
Virat Kohli
‘విరాట్ బెస్ట్ వన్డే ప్లేయర్’ అని స్టీవ్ స్మిత్ సమాధానం ఇవ్వగా, ‘అతనో ఫైటర్, గేమ్ ఛేంజర్’ అంటూ శ్రీలంక కెప్టెన్ దసున్ శనక సమాధానం ఇచ్చాడు. ‘క్వాలిటీ ప్లేయర్, మనల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తాడు..’ అంటూ ట్రెంట్ బౌల్ట్ సమాధానం చెప్పాడు..
Virat Kohli
‘విరాట్ కోహ్లీ ప్రస్తుత తరంలో గ్రెటెస్ట్ క్రికెటర్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంకా ఎవ్వరైనా విరాట్‌ని గ్రేటెస్ట్ అని ఒప్పుకోలేకపోతే క్రికెట్ చూడడం మానేయండి. ఇది మీలాంటి వాళ్ల కోసం కాదు..’ అంటూ టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు..