MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • జక్కనకు బాగా నచ్చిన క్రికెటర్ అతనే... ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకధీర రాజమౌళి...

జక్కనకు బాగా నచ్చిన క్రికెటర్ అతనే... ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకధీర రాజమౌళి...

టాలీవుడ్‌లో కొన్ని దశాబ్దాల తర్వాత వస్తున్న అతిపెద్ద మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. రెండు సినీ కుటుంబాలకు చెందిన ఇద్దరు స్టార్లు, హీరోలుగా నటిస్తుండడంతో ఇప్పుడు దేశమంతా ‘ఆర్ఆర్ఆర్’ నామస్మరణే వినిపిస్తోంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 28 2021, 01:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

జనవరి 7, 2022న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇంటర్వ్యూలు, టాక్ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటూ తెగ బిజీ బిజీగా గడుపుతోంది మూవీ టీమ్...

29

బాలీవుడ్‌లో భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ కోసం సల్మాన్ ఖాన్ ముఖ్యఅతిథిగా ముంబైలో హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా... తాజాగా తమిళ ప్రేక్షకుల కోసం చెన్నైలో ఈ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు...

39

కోలీవుడ్ హీరోలు ఉదయనిధి స్టాలిన్, శివ కార్తికేయన్ ముఖ్యఅతిథులుగా హాజరైన తమిళ్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శక ధీరుడు రాజమౌళి, యాంకర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు తన స్టైల్‌లో సమాధానాలు ఇచ్చాడు...

49

‘మీ ఫెవరెట్ క్రికెటర్ ఎవరు’ అని యాంకర్ అడగ్గానే, ఠక్కున ‘విరాట్ కోహ్లీ...’ అంటూ సమాధానం ఇచ్చాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి...

59

జక్కన్న చెప్పిన ఈ సమాధానం, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌ను ఆనందోత్సాహాల్లో ముంచేసింది. భవిష్యత్తులో కోహ్లీ బయోపిక్ మూవీ రూపొందితే, దానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తే బాగుంటుందని కోరుతున్నారు విరాట్ ఫ్యాన్స్...

69

విరాట్ కోహ్లీ దూకుడు, ఆన్‌ ఫీల్డ్‌లో ఎంతో అగ్రెసివ్ యాటిట్యూడ్‌లో ఉండే విరాట్ కోహ్లీ జీవితంలో, క్రికెట్ కెరీర్‌లోనూ ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి... 

79

తండ్రి చనిపోయిన తర్వాతి రోజే మళ్లీ క్రికెట్ ఆడేందుకు వచ్చాడు విరాట్ కోహ్లీ. అలాగే అండర్19 వరల్డ్ కప్ నుంచి టీమ్‌లోకి వచ్చి, స్థిరమైన స్థానం సంపాదించుకున్నాడు...

89

స్టార్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్‌గా, ‘ఛేజ్ మాస్టర్’గా, ‘రన్ మెషిన్’గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ, వ్యక్తిగత జీవితంలో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో పెళ్లి, బీసీసీఐ బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం వంటి అంశాలతో బయోపిక్ ప్లాన్ చేయాలని రాజమౌళిని కోరుతున్నారు అభిమానులు...

99

‘యంగ్ టైగర్’ ఎన్టీఆర్, ‘మెగాపవర్ స్టార్’ రామ్‌చరణ్ హీరోలుగా, ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా అజయ్ దేవగణ్, శ్రియా శరణ్ ముఖ్య పాత్రధారులుగా రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ బడ్జెట్, దాదాపు రూ.400 కోట్లు...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
LSG vs DC : పంత్ కు ఝలక్ ఇచ్చిన అక్షర్ పటేల్.. గెలిచే మ్యాచ్ లో లక్నో ఎలా ఓడిపోయింది?
Recommended image2
IPL 2026: CSKపై పిచ్చికొట్టుడు.. బుడ్డోడు వైభవ్‌కు బీసీసీఐ బంపర్ ఆఫర్.!
Recommended image3
అర్జున్ టెండూల్కర్ రోల్ మోడల్ సచిన్ కాదు.. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved