- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ 100 కాదు, 110 సెంచరీలు చేస్తాడు! ముందు అతన్ని గౌరవించండి... పాక్ మాజీ పేసర్ ...
విరాట్ కోహ్లీ 100 కాదు, 110 సెంచరీలు చేస్తాడు! ముందు అతన్ని గౌరవించండి... పాక్ మాజీ పేసర్ ...
విరాట్ కోహ్లీ... అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన మూడో క్రికెటర్. అయితే విరాట్ బ్యాటు నుంచి 71వ సెంచరీ ఎప్పుడు వస్తుందా? అని రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేయగల సత్తా ఉన్న క్రికెటర్‌గా భావించిన విరాట్ కోహ్లీపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్...

Image credit: PTI
ఐపీఎల్ 2022 సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, 22.73 సగటుతో 341 పరుగులు చేశాడు. రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ త్వరగా అవుట్ కావడం, ఆర్‌సీబీపై తీవ్రంగా ప్రభావం చూపింది. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి...
విరాట్ కోహ్లీ ఇక తిరిగి ఫామ్‌లోకి రాలేడని, అతను కెరీర్ ఇక్కడితో ముగిసిపోయిందని... 70 సెంచరీలతోనే రిటైర్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని ట్రోల్స్ వినిపించాయి. ఈ ట్రోల్స్‌పై తీవ్రంగా స్పందించాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్...
‘ఎవ్వరైనా సరే విమర్శలు చేసే ముందు చిన్నపిల్లలు వింటున్నారని అర్థం చేసుకోండి. విరాట్ కోహ్లీ గురించి మంచి విషయాలు చెప్పండి. అతను ఎంతో సాధించాడు. దానికి అతనికి దక్కాల్సిన గౌరవం అతనికి ఇవ్వండి...
ఓ పాకిస్తానీగా నేనే చెబుతున్నా విరాట్ కోహ్లీ ఆల్ టైం గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఒకడు. అతను 100 కాదు, 110 సెంచరీలు చేయాలని నేను కోరుకుంటున్నా. 110 సెంచరీలు చేస్తాడు... చేయాలి...
విరాట్ కోహ్లీ ఎంత ఎక్కువ కాలం ఆడితే, క్రికెట్‌కి అంత మంచిది. నేనైతే విరాట్ కోహ్లీ 45 ఏళ్లు వచ్చే వరకూ క్రికెట్‌లో కొనసాగాలని కోరుకుంటున్నా. అతను ఫిట్‌గా ఉన్నాడు. ఫిట్‌నెస్‌పై పూర్తి ఫోకస్ పెడతాడు...
110 సెంచరీల కోసం ప్రిపేర్ అవ్వడం చాలా కష్టమే. ఎందుకంటే చాలామంది అతన్ని ద్వేషిస్తున్నారు. అతన్ని తిడుతూ ట్వీట్లు చేస్తున్నారు. దీపావళి గురించి ట్వీట్ చేస్తే తిడతారు. భార్యా బిడ్డతో ట్వీట్ చేస్తే తిడతారు...
వరల్డ్ కప్ ఓడిపోయావని తిడతారు. ఐపీఎల్ ఓడిపోయావని తిడతారు. ఇంత ద్వేషాన్ని స్వీకరిస్తున్నప్పుడు ఆటపై ఫోకస్ పెట్టడం చాలా కష్టం. అయితే విరాట్ కోహ్లీ ఏం చేయగలడో, ఏం చేస్తాడో.. ఏం సాధించాడో మరోసారి ప్రపంచానికి చూపిస్తే చూడాలి...
సచిన్ టెండూల్కర్ గ్రేటెస్ట్ క్రికెటర్. అతను చాలా వినయంగా ఉండేవాడు. అందుకే సచిన్ టెండూల్కర్‌కి ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవాళ్లు. విమర్శించేవాళ్లు తక్కువ ఉండేవాళ్లు.
సచిన్ ప్రతీ ఒక్క క్రికెటర్‌ని గౌరవించేవాడు... విరాట్ కూడా సచిన్‌కి తక్కువేమీ కాదు.. కానీ అతనికి సచిన్‌కి దక్కిన గౌరవం దక్కడం లేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్..