- Home
- Sports
- Cricket
- విండీస్ వద్దు, జింబాబ్వే ముద్దు... విరాట్ కోహ్లీని ఫామ్‌లోకి తెచ్చేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్...
విండీస్ వద్దు, జింబాబ్వే ముద్దు... విరాట్ కోహ్లీని ఫామ్‌లోకి తెచ్చేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్...
గత దశాబ్దంలో 20 వేలకు పైగా పరుగులు చేసి సరికొత్త చరిత్ర క్రియేట్ చేసి, ‘ప్లేయర్ ఆఫ్ ది డికేట్’గా నిలిచిన విరాట్ కోహ్లీ... ఇప్పుడు వరుసగా విఫలమవుతూ వార్తల్లో నిలిచాడు. టన్నుల్లో పరుగులు చేసినప్పుడు మెచ్చుకోవడానికి పెగలని నోళ్లు, ఇప్పుడు విరాట్ కోహ్లీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో వీరంగం సృష్టిస్తున్నాయి... వీరికి విరాట్ తన బ్యాటుతో ఎప్పుడు సమాధానం చెబుతాడా? అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు...

ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 మెగా టోర్నీలకు ముందు విరాట్ కోహ్లీని ఎలాగైనా ఫామ్‌లోకి తీసుకురావడానికి మాస్టర్ ప్లాన్ వేస్తోంది భారత క్రికెట్ బోర్డు...
ఇంగ్లాండ్ టూర్‌లో ఓ టెస్టు, రెండు వన్డేలు, రెండు టీ20 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ... ఒక్క మ్యాచ్‌లో కూడా 30+ స్కోరు చేయలేకపోయాడు. నిర్ణయాత్మక ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చేసిన 20 పరుగులే అత్యధిక స్కోరు...
ఇంగ్లాండ్ టూర్‌లో అట్టర్‌ఫ్లాప్ అయినప్పటికీ వెస్టిండీస్ టూర్‌కి ప్రకటించిన జట్టులో విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. వన్డే సిరీస్ నుంచి రోహిత్ శర్మ, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా వంటి సీనియర్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ, టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో కూడా విరాట్‌కి రెస్ట్ ఇచ్చింది...
Virat Kohli
దాదాపు నెల రోజుల పాటు భారత జట్టుకి దూరంగా గడపబోతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, పసికూన జింబాబ్వేతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి...
ఫామ్ అందుకోవడానికి తెగ కష్టపడుతున్న విరాట్ కోహ్లీని జింబాబ్వే టూర్‌లో పాల్గొనాల్సిందిగా బీసీసీఐ సూచనలు చేసిందట. ‘జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఆడాల్సిందిగా విరాట్‌ని కోరాం. ఆసియా కప్‌కి ముందు ఈ టోర్నీ, విరాట్‌కి బాగా హెల్ప్ అవుతుంది... ’ అంటూ బీసీసీఐ సెలక్షన్ కమిటీకి చెందిన ఓ అధికారి, మీడియాకి తెలియచేశాడు...
గాయం కారణంగా సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు దూరంగా ఉన్న భారత బ్యాటర్ కెఎల్ రాహుల్... జింబాబ్వేతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...
Virat Kohli
కెఎల్ రాహుల్ అందుబాటులో లేకపోతే సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీలో జింబాబ్వేతో వన్డే సిరీస్ ఆడుతుంది భారత జట్టు. ఇదే జరిగి విరాట్ ఈ సిరీస్‌లో ఆడితే, ధావన్ కెప్టెన్సీలో తొలిసారి ఆడతాడు భారత మాజీ కెప్టెన్ కోహ్లీ..
Image credit: Getty
ప్రస్తుత పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఎప్పుడూ ఫామ్ కోల్పోయినా జింబాబ్వేతో సిరీస్ ఆడి, ఫామ్‌లోకి వచ్చేవాడని క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా అదే పంథాని ఎంచుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది...