MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ కోహ్లీ రికార్డు హాఫ్ సెంచరీ... అంతలోనే అవుటై, మరోసారి ఫ్యాన్స్‌కి నిరాశ...

విరాట్ కోహ్లీ రికార్డు హాఫ్ సెంచరీ... అంతలోనే అవుటై, మరోసారి ఫ్యాన్స్‌కి నిరాశ...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది... 105 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ రూపంలో కీలక వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఇప్పటికే సగం జట్టు పెవిలియన్ చేరడంతో ఈ మ్యాచ‌లోనూ స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యే ప్రమాదంలో పడింది టీమిండియా...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 02 2021, 07:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఓ వైపు వికెట్లు పడుతున్నా 96 బంతుల్లో 8 ఫోర్లతో 50 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రాబిన్‌సన్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

210

విరాట్ కోహ్లీకి ఇది టెస్టుల్లో 27వ హాఫ్ సెంచరీ కాగా, సేనా దేశాల్లో 23వ హాఫ్ సెంచరీ. సచిన్ టెండూల్కర్ 40, రాహుల్ ద్రావిడ్ 27 మాత్రమే విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు...

310

27 ఇన్నింగ్స్‌ల తర్వాత టెస్టుల్లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు విరాట్ కోహ్లీ. కెప్టెన్‌గా విరాట్ కోహ్లకి ఇది ఇంగ్లాండ్‌లో ఏడో హాఫ్ సెంచరీ...

410

మహేంద్ర సింగ్ ధోనీ ఆరుసార్లు ఈ ఫీట్ సాధించగా, సౌరవ్ గంగూలీ నాలుగు సార్లు ఇంగ్లాండ్‌లో హాఫ్ సెంచరీ చేసి మూడో స్థానంలో ఉన్నాడు...

510

2021లో మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీ 9 హాఫ్ సెంచరీలు చేసి, టీమిండియా తరుపున టాప్‌లో ఉండగా... ఓవరాల్‌గా పాక్ ప్లేయర్లు బాబర్ ఆజమ్, రిజ్వాన్ మాత్రమే 11 సెంచరీలతో కోహ్లీ కంటే ముందున్నారు...

610

అంతకుముందు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొంది, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రవీంద్ర జడేజా... 34 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

710

69 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది టీమిండయా. అంతకుముందు రోహిత్ శర్మ 11 పరుగులు చేసి క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 28 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. 

810

అదే స్కోరు వద్ద 17 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ కూడా అవుట్ కాగా... పూజారా 4 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు...

910

39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో నాలుగో వికెట్‌కి 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు జడేజా, కోహ్లీ...  మరోవైపు 22 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు విరాట్ కోహ్లీ. క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను జో రూట్ అందుకోలేకపోయాడు...

1010

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజింకా రహానే, క్రిస్‌వోలక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినట్టు ప్రకటించాడు అంపైర్. అయితే రివ్యూకి వెళ్లిన భారత జట్టుకి అనుకూలంగా ఫలితం దక్కింది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : పాకిస్థాన్ vs న్యూజిలాండ్ మ్యాచ్ రద్దుతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
Recommended image2
PAK vs NZ : పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు.. సెమీస్ కష్టమే.. అసలు కారణం ఇదే
Recommended image3
IND vs SA : భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్ ను వర్షం దెబ్బకొడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved