బాబర్ ఆజమ్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన విరాట్ కోహ్లీ... మరింత ఎదగాలని కోరుకుంటూ...
దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ మధ్య వైరం ఈనాటిది కాదు. దేశ విభజన తర్వాత కొన్ని దశాబ్దాల పాటు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడిన భారత్, పాకిస్తాన్... 9 ఏళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలబడుతున్నాయి. దీంతో ఇరు దేశాల క్రికెటర్ల మధ్య సాన్నిహిత్యం, చనువు కూడా తక్కువే...

Image Credit: Getty Images
తాజాగా ఫామ్ కోల్పోయి పరుగులు చేయడానికి కష్టపడుతూ, సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ గురించి, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చేసిన ట్వీట్... అందరి దృష్టిని ఆకర్షించింది...
Image credit: PTI
కెరీర్ ఆరంభంలో విరాట్ కోహ్లీ తన గురువు అని, తన రోల్ మోడల్ అని ప్రకటించిన బాబర్ ఆజమ్, టీ20, వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లో దూసుకుపోతూ... మూడు ఫార్మాట్లలో టాప్ 5లో కొనసాగుతున్నాడు..
‘త్వరలోనే ఈ పరిస్థితుల నుంచి బయటికి వస్తావ్... ధైర్యంగా ఉండు’ అంటూ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, విరాట్ కోహ్లీ గురించి వేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది... ఈ ఒక్క ట్వీట్‌తో బాబర్ ఆజమ్ ఓ మెట్టు ఎక్కేశాడని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు...
Babar Azam backs Virat Kohli
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ టాస్ సమయంలో విరాట్ కోహ్లీతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన బాబర్ ఆజమ్.. ఈ ట్వీట్ వేయడానికి గల కారణాలను కూడా వివరించాడు...
‘విరాట్ కోహ్లీ ఎంతో క్రికెట్ ఆడాడు. అతని కెరీర్ గ్రాఫ్ చూస్తే, కోహ్లీ ఏం సాధించాడో అర్థమవుతుంది. ఇప్పుడు అతను సరైన ఫామ్‌లో లేడు. ఈ సమయంలో మోరల్ సపోర్ట్ చాలా అవసరం. అందుకే అలా ట్వీట్ చేశాను...’ అంటూ చెప్పుకొచ్చాడు బాబర్ ఆజమ్...
తాజాగా భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చాడు... ‘థ్యాంక్యూ. నువ్వు ఇలా వెలుగుతూనే ఉండు, ఎదుగుతూనే ఉంది... విష్ యూ ఆల్ ది బెస్ట్...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, విరాట్ గురించి ట్వీట్ చేయడమే పెద్ద విశేషమైతే... దానికి కోహ్లీ కామెంట్‌తో రిప్లై ఇవ్వడంతో క్రికెట్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు... భారత మాజీ సారథి విరాట్ కోహ్లీకి పాకిస్తాన్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే...
బాబర్ ఆజమ్ చేసిన ట్వీట్‌కి విరాట్ కోహ్లీ స్పందించి ఉంటే బాగుండేదని పాక్ మాజీ కెప్టెన్,ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిదీ కామెంట్ చేసిన కొద్దిసేపటికే భారత మాజీ కెప్టెన్ ఇలా రియాక్ట్ అవ్వడం విశేషం..