- Home
- Sports
- Cricket
- సెంచరీ తర్వాత! కనీసం 50 కూడా కొట్టలేవా కోహ్లీ... ఎక్కడి నుంచో ఎక్కడికో దిగజారిన యావరేజ్...
సెంచరీ తర్వాత! కనీసం 50 కూడా కొట్టలేవా కోహ్లీ... ఎక్కడి నుంచో ఎక్కడికో దిగజారిన యావరేజ్...
బీసీసీఐతో విభేదాలతో కెప్టెన్సీ కోల్పోయాడు విరాట్ కోహ్లీ. అయితే కోహ్లీ కెప్టెన్సీ పోవడానికి అతని పేలవ ఫామ్ కూడా ఓ కారణం. మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోతున్న కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ. ఈ నిర్ణయం ఓ రకంగా విరాట్ కోహ్లీకి మంచే చేసింది...

Virat Kohli
ఆసియా కప్ 2022 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించాడు. మూడేళ్లకు పైగా అందకుండా విసిగించిన 71వ సెంచరీని టీ20ల్లో అందుకున్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాత వన్డేల్లో వరుసగా 3 సెంచరీలు బాదేశాడు. అయితే టెస్టుల్లో మాత్రం విరాట్ కోహ్లీ ఫామ్‌ని అందుకోలేకపోతున్నాడు...
Virat Kohli
గత 10 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ ఒక్క హాఫ్ సెంచరీ కూడా అందుకోలేకపోయాడు. 20, 1, 19 నాటౌట్, 24, 1, 12, 44, 20, 22, 13 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... చివరిగా సౌతాఫ్రికా టూర్‌లో కేప్‌టౌన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ...
Virat kohli
అప్పుడెప్పుడో 2019లో వెస్టిండీస్‌పై 27వ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ, 41 ఇన్నింగ్స్‌లుగా సెంచరీ అందుకోలేకపోతున్నాడు. 15 ఇన్నింగ్స్‌లుగా కనీసం 50+ స్కోరు కూడా అందుకోలేకపోతున్నాడు. ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 44 పరుగులు మాదిరిగా ఒకటి రెండు పర్ఫామెన్స్‌లు మినహాయిస్తే.. గత 22 టెస్టుల్లో విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి చెప్పుకోదగ్గ ఓ మంచి ఇన్నింగ్స్ రాలేదు...
Image credit: PTI
తొలి రెండు టెస్టుల్లో కెఎల్ రాహుల్ అట్టర్ ఫ్లాప్ కావడంతో విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ పెద్దగా డిస్కర్షన్ జరగలేదు. ఇండోర్ టెస్టులో రాహుల్ ఆడలేదు. అతని ప్లేస్‌లో వచ్చిన శుబ్‌మన్ గిల్ కూడా పెద్దగా మెప్పించలేకపోయాడు. టీమ్‌లో సీనియర్ మోస్ట్ బ్యాటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ కూడా ఆశించిన స్థాయి పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...
Image credit: PTI
తొలి ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ అవుట్ కావడానికి అతని చెత్త షాట్ సెలక్షనే కారణం. ఆసీస్ బ్యాటర్లు ఎలాగైతే స్వీప్ షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యారో, స్వదేశంలో 200 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ కూడా అలాగే అవుట్ అయ్యాడు..
Image credit: PTI
83 టెస్టులు ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ టెస్టు సగటు 54.97గా ఉంది. మూడు ఫార్మాట్లలో 50+ యావరేజ్ ఉన్న ఏకైక బ్యాటర్‌గా చరిత్ర లిఖించాడు విరాట్. అయితే ఆ తర్వాత నుంచి విరాట్ సగటు పడిపోతూ వస్తోంది. 84వ టెస్టులో 54.30, 85వ టెస్టులో 53.62, 90వ టెస్టుకి వచ్చేసరికి 52.37కి... 99 టెస్టులు వచ్చేసరికి 50.35కి పడిపోయింది.
Image credit: PTI
100వ టెస్టులోనూ పెద్దగా మెప్పించలేకపోయిన విరాట్ కోహ్లీ సగటు తొలిసారి 50 కిందకి పడిపోయింది. 101వ టెస్టులో 49.53గా ఉన్న కోహ్లీ సగటు, 103వ టెస్టు వచ్చేసరికి 48.9కి, 104 టెస్టులో 48.68కి, 105వ టెస్టులో 48.49కి చేరింది. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టు ముగిసే సరికి విరాట్ కోహ్లీ టెస్టు సగటు 48.1కి చేరుకుంది...
Virat Kohli Out
ఇలాగే కొనసాగితే విరాట్ కోహ్లీ టెస్టు సగటు, మరో 10 టెస్టులు ముగిసే సరికి 40+ ల్లోకి పడిపోతుంది. ఫ్యాబ్4లో టాప్‌లో ఉన్న విరాట్, ఇప్పటికే టాప్ 3కి పడిపోయాడు. కేన్ విలియంసన్ ఇంకో సెంచరీ చేస్తే నాలుగో స్థానానికి కూడా దిగజారతాడు. కోహ్లీని ఇలా చూసే కంటే అతను రిటైర్ అయితే బెటర్ అంటున్నారు అభిమానులు...
విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఎదురుచూసి, చూసి వారి సహనం నశిస్తోంది. ఎంత పెద్ద లెజెండ్ అయినా, ఎక్కడో ఒకదగ్గర ఆగాల్సిందే. నాలుగో టెస్టులో విరాట్‌కి ప్లేస్ ఉంటుంది. ఆ తర్వాత టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ కోహ్లీని ఆడిస్తారు. అయితే ఆ తర్వాతైనా విరాట్ ప్లేస్‌కి చెక్ పెట్టక తప్పదు...
టీమ్‌కి భారంగా మారుతున్న బ్యాటర్‌ని తప్పించడానికి కారణాలు చెప్పాల్సిన పని లేదు. రెండో టెస్టుకి వైస్ కెప్టెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్ మూడో టెస్టు ఆడలేకపోయాడు. అలాగే విరాట్ కోహ్లీ ప్లేస్ కూడా పర్మినెంట్ అని చెప్పలేం! కోహ్లీ ఈ విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది...