- Home
- Sports
- Cricket
- ఏడాది అంతా ఆడితే రూ.7 కోట్లు! ఒక్క ఇన్‌స్టా పోస్ట్ ద్వారా రూ.11.45 కోట్లు... విరాట్ కోహ్లీ క్రేజ్‌కి...
ఏడాది అంతా ఆడితే రూ.7 కోట్లు! ఒక్క ఇన్‌స్టా పోస్ట్ ద్వారా రూ.11.45 కోట్లు... విరాట్ కోహ్లీ క్రేజ్‌కి...
కెప్టెన్సీ పోయినా, విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ మాత్రం పెరుగుతూనే పోతున్నాయి. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్లలో ఒకరిగా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ... ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్ చేస్తే వచ్చే ఆదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

విరాట్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 256 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌లో 50, ట్విట్టర్‌లో 51 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్న విరాట్, ఇండియాలోనే కాదు, ఆసియా ఖండంలోనే మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ...
Virat Kohli
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న స్పోర్ట్స్ సెలబ్రిటిల్లో వరల్డ్‌లోనే టాప్ 3లో ఉన్న విరాట్ కోహ్లీ, ఒక్కో ఇన్‌స్టా పోస్ట్ ద్వారా రూ.11.45 కోట్ల ఆదాయాన్ని ఖాతాలో వేసుకుంటున్నాడు..
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో విరాట్ కోహ్లీకి A+ కేటగిరిలో చోటు దక్కింది. ఏడాదికి సెంట్రల్ కాంట్రాక్ట్ నిమిత్తం బీసీసీఐ నుంచి రూ.7 కోట్లు అందుకుంటున్న విరాట్ కోహ్లీ, కేవలం ఒక్క ఇన్‌స్టా పోస్ట్ ద్వారా రూ.11.45 కోట్లు ఆర్జిస్తున్నాడు..
ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో.. ఒక్కో ఇన్‌స్టా పోస్ట్ ద్వారా రూ.26.7 కోట్లు ఆర్జిస్తుంటే, అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రూ.21.5 కోట్లు ఆర్జిస్తున్నారు. రొనాల్డో, మెస్సీ తర్వాత ఇన్‌స్టా ద్వారా అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న మూడో స్పోర్ట్స్ సెలబ్రిటీ విరాట్ కోహ్లీయే..
ఒక్కో టెస్టు మ్యాచ్ ద్వారా రూ.15 లక్షలు తీసుకుంటున్న విరాట్ కోహ్లీ, ఒక్కో వన్డే మ్యాచ్ ద్వారా రూ.6 లక్షలు, ఒక్కో టీ20 మ్యాచ్ ద్వారా రూ.3 లక్షలు తీసుకుంటున్నాడు. ఇదీ కాకుండా ఐపీఎల్‌లో ఆర్‌సీబీ నుంచి రూ.16 కోట్లు అందుకుంటున్నాడు..
ట్విట్టర్‌లో ఒక్కో పోస్ట్‌కి రూ.3 కోట్ల వరకూ అందుకుంటున్న విరాట్ కోహ్లీ, ఎంపీఎల్ వంటి 8 రకాల స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టాడు. అలాగే వివో, మింత్రా, ఉబర్, ఎంఆర్‌ఎఫ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి డజనుకి పైగా బ్రండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు..