కోహ్లీ చేసిన ఆ మూడు తప్పులే... మొదటి వన్డే ఓటమికి కారణాలివేనా...
ఆసీస్ టూర్‌లో ఫెవరెట్ టీమ్‌గా బరిలో దిగిన టీమిండియా... మొదటి వన్డే మ్యాచ్‌లోనే తేలిపోయింది. జస్ప్రిత్ బుమ్రా, షమీ వంటి టాప్ పేసర్లు ఉన్న టీమిండియా, ప్రత్యర్థి భారీ స్కోరు ముట్టజెప్పింది. ఆ తర్వాత లక్ష్యచేధనలో ఏ దశలోనూ లక్ష్యంవైపు సాగుతున్నట్టు కనిపించలేదు. అయితే మొదటి వన్డే ఓటమికి విరాట్ కోహ్లీ చేసిన మూడు తప్పులే కారణమని చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు.
టాస్... బ్యాటింగ్‌కి అనుకూలించే సిడ్నీ టెస్టులో టాస్ చాలా కీలకం. ఇక్కడ టాస్ గెలిచిన జట్లకే మెజారిటీ మ్యాచుల్లో గెలుపుదక్కింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి వన్డేలో టాస్ ఓడిపోవడం టీమిండియాకి పెద్ద మైనస్ పాయింట్ అయ్యింది.
నవ్‌దీప్ సైనీ... వెన్నునొప్పితో బాధపడుతున్న నవ్‌దీప్ సైనీ మొదటి వన్డే మ్యాచ్‌కి దూరంగా ఉంటాడని టాక్ వినిపించింది. అయితే అన్యూహ్యంగా అతన్ని జట్టులోకి తీసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. ఈ వ్యూహం ఆసీస్‌కి బాగా కలిసివచ్చింది.
వెన్ను నొప్పి గాయం నుంచి పూర్తిగా కోలుకొని నవ్‌దీప్ సైనీ.... 10 ఓవర్లలో 83 పరుగులిచ్చాడు. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ లేదా ఐపీఎల్‌లో మెరిసిన నటరాజన్‌కి అవకాశం ఇచ్చి ఉంటే ఫలితం కాస్త మెరుగ్గా ఉండేది...
యజ్వేంద్ర చాహాల్... మొదటి వన్డే మ్యాచ్‌లో చాహాల్‌పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు చాహాల్. అయితే మొదటి ఓవర్ నుంచే చాహాల్‌పై ఎదురుదాడికి దిగిన ఆసీస్ బ్యాట్స్‌మెన్... ఏకంగా 10 ఓవర్లలో 89 పరుగులు రాబట్టారు. వన్డేల్లో అత్యధిక పరుగులిచ్చిన భారత బౌలర్‌గా చెత్త రికార్డు నమోదుచేశాడు చాహాల్.
వ్యూహం బెడిసికొట్టిందా... టీమిండియా ముందు ఉన్నది 375 పరుగుల భారీ టార్గెట్. ఈ లక్ష్యాన్ని చేధించాలంటే భారీ భాగస్వామ్యాలు కావాలి. అయితే మొదటి ఓవర్ నుంచి దూకుడైన బ్యాటింగ్ వ్యూహాన్ని అమలు చేశాడు విరాట్ కోహ్లీ.
5.3 ఓవర్లలోనే 53 పరుగులు చేసి ఓపెనింగ్ జోడి అదరగొట్టింది కూడా. అయితే మొదటి వికెట్ పడిన తర్వాతైన విరాట్ కోహ్లీ బాధ్యతాయుతంగా వ్యవహారించి జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సింది.
అయితే తన స్టైల్‌కి వ్యతిరేకంగా మొదటి నుంచి దూకుడుగా ఆడడానికి ప్రయత్నించాడు విరాట్ కోహ్లీ. సాధారణంగా మొదట్లో నెమ్మదిగా బ్యాటింగ్ చేసి, బౌలర్లుపై పట్టు దొరికిన తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడే కోహ్లీ తొందరపడి నిర్లక్ష్యపు షాట్‌కి అవుట్ అయ్యాడు.
ఫీల్డింగ్... భారత జట్టులో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా వంటి మెరుపు ఫీల్డర్లు ఉన్నారు. అయినా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఈజీగా బౌండరీలు రాబడుతూ భారీ స్కోరు చేయగలిగారు. దీనికి కారణం భారత జట్టు ఫీల్డ్ ప్లేస్‌మెంట్.
ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌లో చాలా పూర్ అయిన విరాట్ కోహ్లీ, టీ20 తరహా ఫీల్డింగ్‌ను ఆస్ట్రేలియాకు ఆఫర్ ఇచ్చాడు. దీంతో రెచ్చిపోయిన ఆసీస్ బ్యాట్స్‌మెన్ భారీగా పరుగులు రాబట్టాడు. ఐపీఎల్‌లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయిన మ్యాక్స్‌వెల్ తేలిగ్గా సిక్సర్లు బాదడమే ఇందుకు నిదర్శనం.
కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఫెయిల్యూర్... భారీ లక్ష్యచేధనలో భారత జట్టు 300+ స్కోరు చేయగలిగింది. అయితే మిడిల్ ఆర్డర్ శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ నిలబడి ఉంటే మ్యాచ్‌లో విజయం దక్కేదే. రాహుల్, అయ్యర్ ఫెయిల్యూర్ కూడా టీమిండియా ఓటమికి కారణం.