విరాట్ అలా చేస్తాడని అనుకోలేదు, చాలా బాధపడ్డాను... శార్దూల్ ఠాకూర్ కామెంట్స్...
టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం, క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కోహ్లీ విషయాలపై పెద్దగా స్పందించిన రోహిత్ శర్మ కూడా షాక్ అయ్యానంటూ రియాక్ట్ అయ్యాడంటే విరాట్ నిర్ణయం ఎంత సడెన్‌గా, సర్‌ప్రైజింగ్‌గా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు...
- FB
- TW
- Linkdin
Follow Us
)
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మూడు ఫార్మాట్లలో ఆరంగ్రేటం చేసి, స్టార్ పర్ఫామర్‌గా మారిన శార్దూల్ ఠాకూర్ కూడా ఈ నిర్ణయంపై తాజాగా స్పందించాడు...
‘విరాట్ కోహ్లీ నుంచి ఈ రకమైన నిర్ణయం అస్సలు ఊహించలేదు. విరాట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో టీమ్ మొత్తం ఎమోషనల్ అయ్యింది... ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం...
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మేం అద్భుతంగా ఆడాం. ముఖ్యంగా విదేశాల్లో ఇంతకుముందు లేని విధంగా అద్భుత విజయాలు అందుకున్నాం...
ఓడిపోయిన మ్యాచుల్లో కూడా విజయం అంచుల దాకా వచ్చి పోరాడగలిగాం. బాగా ఆడుతున్నప్పుడు, విజయాలు వస్తున్నప్పుడు విరాట్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో అర్థం కాలేదు...
దాదాపు ఏడేళ్లుగా టీమ్‌ను సరైన మార్గంలో నడిపందుకు విరాట్ కోహ్లీ కృషి చేస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు శార్దూల్ ఠాకూర్...
‘సౌతాఫ్రికాలో రెండు మ్యాచుల్లో మేం ఓడిపోవడానికి కూడా అదృష్టం కలిసి రాకపోవడమే కారణం. రెండు మ్యాచుల్లోనూ టాస్ గెలిచినా వారికి పరిస్థితులు అనుకూలించాయి...
ప్రత్యర్థి ముందు 300+ టార్గెట్ పెడితే, బౌలర్లకు రెట్టింపు ఉత్సాహం వస్తుంది. అదే 200+ టార్గెట్ ఉంటే, బ్యాట్స్‌మెన్ నమ్మకంతో ఆడతారు. సౌతాఫ్రికాలో జరిగింది అదే...’ అంటూ కామెంట్ చేశాడు శార్దూల్ ఠాకూర్...
టెస్టు కెప్టెన్‌గా 68 మ్యాచుల్లో 40 విజయాలు అందుకుని, మోస్ట్ సక్సెస్‌ఫుల్ భారత కెప్టెన్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, కేప్ టౌన్ టెస్టు తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు...