రన్ మెషిన్‌కి రిపేరు పడిందా... దారుణంగా విఫలమవుతున్న విరాట్ కోహ్లీ... గత 22 ఇన్నింగ్స్‌ల్లో...
First Published Nov 28, 2020, 1:11 PM IST
విరాట్ కోహ్లీ... క్రికెట్ ప్రపంచంలో ఓ సంచలనం. టన్నుల కొద్దీ పరుగులు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచిన విరాట్ కోహ్లీ... కొంత కాలంగా బాగా ఇబ్బంది పడుతున్నాడు. వన్డేలు, టెస్టులు, టీ20లు అనే సంబంధం లేకుండా అన్ని ఫార్మాట్లలో చెలరేగే విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి సెంచరీ వచ్చి చాలా కాలమైంది. తాజాగా ఆస్ట్రేలియా జరిగిన మొదటి వన్డేలోనూ ఈ ఛేజింగ్ కింగ్ దారుణంగా విఫలమయ్యాడు.

మొదటి వన్డేలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన విరాట్ కోహ్లీ... 21 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

వన్డేల్లో సెకండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సెంచరీలు చేసి ‘ఛేజింగ్ కింగ్’గా కీర్తించబడిన విరాట్ కోహ్లీ నిర్లక్ష్యంగా షాట్స్ ఆడుతూ అవుట్ అవ్వడం ఫ్యాన్స్‌కి ఆశ్చర్యానికి గురి చేసింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?