1206 రోజులు తర్వాత... టెస్టు సెంచరీతో రేసులోకి రీఎంట్రీ ఇచ్చిన ‘కింగ్’ కోహ్లీ...
విరాట్ కోహ్లీ... సచిన్ టెండూల్కర్ తర్వాత క్రికెట్ ప్రపంచాన్ని ఆ రేంజ్‌లో శాసించిన బ్యాట్స్‌మెన్... మెరుపు వేగంతో 70 అంతర్జాతీయ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, 71వ సెంచరీని అందుకోవడానికి 1021 రోజుల సమయం తీసుకున్నాడు. ఆఫ్ఘాన్‌తో టీ20ల్లో మొట్టమొదటి సెంచరీతో 71వ అంతర్జాతీయ శతకాన్ని అందుకున్న కోహ్లీ... టెస్టుల్లో మాత్రం ఫెయిల్ అవుతూ వచ్చాడు...

2022, సెప్టెంబర్ 8న కెరీర్‌లో 71వ అంతర్జాతీయ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, 2022 డిసెంబర్ 10న వన్డే సెంచరీని అందుకున్నాడు. మూడేళ్ల బ్రేక్ తర్వాత వచ్చిన వన్డే సెంచరీ అది. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో రెండు సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ... 2023, మార్చి 12న టెస్టు సెంచరీ అందుకున్నాడు...
డిసెంబర్ 2019 నుంచి ఆగస్టు 2022 వరకూ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు విరాట్ కోహ్లీ. 2022 సెప్టెంబర్ నుంచి మార్చి 2023 మధ్య 5 అంతర్జాతీయ సెంచరీలు చేసేసి... మూడు ఫార్మాట్లలోనూ కమ్‌బ్యాక్ ఇచ్చేశాడు..
వన్డే, టీ20లతో పోలిస్తే టెస్టులంటేనే విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైన అభిమానం. అయితే జనవరి 2021 నాటికి టెస్టుల్లో 27 సెంచరీలతో ఫ్యాబ్4లో టాప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ... మూడేళ్లుగా టెస్టు సెంచరీ చేయకపోవడంతో వెనకబడిపోయాడు. 1206 రోజుల తర్వాత టెస్టు సెంచరీ చేసి, తిరిగి రేసులోకి తిరిగి వచ్చాడు విరాట్ కోహ్లీ...
Virat Kohli
అత్యంత వేగంగా 75 అంతర్జాతీయ సెంచరీలు చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ మాత్రమే 75కి పైగా సెంచరీలు చేశాడు. అయితే 75వ సెంచరీ మార్కు అందుకోవడానికి సచిన్ కంటే 14 సెంచరీలు తక్కువగా తీసుకున్నాడు విరాట్ కోహ్లీ...
Virat Kohli
మొదటి 25 సెంచరీలు అందుకోవడానికి 184 ఇన్నింగ్స్‌లు తీసుకున్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాత 26 నుంచి 50 సెంచరీలు అందుకోవడానికి 164 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. 51 నుంచి 75 సెంచరీలను చేరుకోవడానికి విరాట్ కోహ్లీకి 204 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి...
Virat Kohli
టెస్టుల్లో విరాట్ కోహ్లీ 28 సెంచరీలు చేస్తే, అందులో సగం స్వదేశంలో చేశాడు, మిగిలిన సగం విదేశాల్లో చేశాడు. సచిన్ టెండూల్కర్ స్వదేశంలో 22 సెంచరీలు చేసి టాప్‌లో ఉంటే, సునీల్ గవాస్కర్ 16, రాహుల్ ద్రావిడ్ 15 సెంచరీలతో కోహ్లీ కంటే ముందున్నారు..
Virat Kohli
విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్‌లో ఇదో రెండో స్లోయెస్ట్ సెంచరీ. ఇంతకుముందు 2012లో నాగ్‌పూర్ టెస్టులో 289 బంతుల్లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఈసారి 241 బంతులు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీకి ఇది 16వ సెంచరీ. 20 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ టాప్‌లో ఉండగా, కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు...