- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఆటతీరు పూర్తిగా మారింది... ఆస్ట్రేలియా దిగ్గజం మిచెల్ జాన్సన్...
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఆటతీరు పూర్తిగా మారింది... ఆస్ట్రేలియా దిగ్గజం మిచెల్ జాన్సన్...
విరాట్ కోహ్లీకి ఇక్కడ అభిమానులు ఉంటే, ఆస్ట్రేలియాలో వీరాభిమానులు ఉంటారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లకు విరాట్ కోహ్లీ అంటే ప్రత్యేకమైన అభిమానం. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాలో టీమిండియా చూపించిన పర్ఫామెన్స్ అలాంటిది. తాజాగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య టీ20 సిరీస్ ఆరంభానికి ముందు మిచెల్ జాన్సన్... కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

Image credit: Getty
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, దీపక్ చాహార్, మహ్మద్ షమీలకు చోటు కల్పించింది బీసీసీఐ. అయితే షమీ కరోనా బారిన పడడంతో మూడేళ్ల తర్వాత ఉమేశ్ యాదవ్ టీ20ల్లో రీఎంట్రీ ఇస్తున్నాడు...
Image credit: PTI
‘టీమిండియాలో ఓ స్టార్ ఆల్‌రౌండర్ (హార్ధిక్ పాండ్యా) ఉన్నాడు. అతనితో పాటు ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలో దిగొచ్చు. భారత పిచ్‌లపై నలుగురు పేసర్లతో ఆడడం రిస్కే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్పిన్నర్లు కీ రోల్ పోషిస్తారు...
Image credit: Getty
ఆస్ట్రేలియా పిచ్‌లపై అయితే ముగ్గురు, నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉంటే ఆ పరిస్థితులకు సెట్ అవుతుంది. పెర్త్‌లో నలుగురు ఫాస్ట్ బౌలర్లతో ఆడినా ఎలాంటి రిస్క్ ఉండదు. అక్కడ ఎలాంటి వ్యూహాలతో రావాలనేది సెపరేట్ ఛాప్టర్...
విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం టీమిండియాకి చాలా పెద్ద పాజిటివ్. ఎందుకంటే బెస్ట్ ప్లేయర్ ఫామ్‌లో ఉంటే మిగిలిన ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతుంది. ప్రెషర్ తగ్గుతుంది..
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక టీమ్ ఫోకస్ మొత్తం మార్చేశాడు. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెంచి, భారత జట్టును టాప్ క్లాస్ టీమ్‌గా మార్చాడు. విరాట్ కోహ్లీ పరుగులు చేయడం, టీమ్‌కి సంతోషాన్ని ఇస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్..