- Home
- Sports
- Cricket
- డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి బ్యాటు విసిరేశాడు! పక్కనే ఉన్న నన్నుచూసి... విరాట్ కోహ్లీపై మహ్మద్ కైఫ్ కామెంట్స్...
డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి బ్యాటు విసిరేశాడు! పక్కనే ఉన్న నన్నుచూసి... విరాట్ కోహ్లీపై మహ్మద్ కైఫ్ కామెంట్స్...
విరాట్ కోహ్లీకి కోపం ఎక్కువ. తన అగ్రెసివ్ యాటిట్యూడ్ కారణంగానే టెస్టుల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ కెప్టెన్‌గా నిలవగలిగాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు చూస్తున్న ‘రేలంగి మావయ్య’ లాంటి విరాట్ కోహ్లీ వేరు. 2012-2018 మధ్య చూసిన విరాట్ కోహ్లీ వేరు, ఆయన ఆట వేరు. అతని ఆవేశం వేరు..

అండర్19 వరల్డ్ కప్ నుంచి 2008లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, స్టార్ బ్యాటర్‌గా టీమ్‌లో స్థిరమైన చోటు దక్కించుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు...
రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ వంటి ప్లేయర్లు, టీమ్‌లో స్థిరమైన చోటు దక్కించుకోవడానికి ఏళ్ల పాటు ఎదురుచూస్తే.. విరాట్ మాత్రం నిలకడైన ప్రదర్శనతో స్టార్ ప్లేయర్ అయ్యాడు..
‘విరాట్ కోహ్లీ, మిగిలిన ప్లేయర్ల కంటే భిన్నమైనవాడని నాకు చాలా ఏళ్ల కిందటే అర్థమైంది. నేను, ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ఆడినప్పుడు విరాట్ కోహ్లీని చాలా దగ్గర్నుంచి చూశాను. ఓ మ్యాచ్‌లో అతను సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యాడు...
కోపంగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చాడు. రాగానే బ్యాటు పడేస్తాడని అనుకున్నా. నేను అనుకున్నట్టే బ్యాటు ఎత్తి పక్కనపడేశారు. ప్యాడ్స్ తీశాడు. నా పక్కనే కూర్చున్నాడు. ఆవేశంగా ‘నెక్ట్స్ మ్యాచ్‌లో నేను భారీ స్కోరు చేస్తా..’ అన్నాడు. నేను, సైలెంట్‌గా ఉండిపోయా...
చెప్పినట్టే ఆ తర్వాతి మ్యాచ్‌లో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్‌ని గెలిపించి, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కూడా గెలిచాడు. అతని మైండ్ సెట్ ఎలా ఉందో తెలిసి నాకు ఆశ్చర్యమేసింది. తక్కువ స్కోరుకి అవుట్ అయ్యాడని అప్‌సెట్ అయ్యాడు...
అయితే ఆ తర్వాతి మ్యాచ్‌లో దాని ఎఫెక్ట్‌ని ఎంత పాజిటివ్‌గా తీసుకున్నాడు. చాలామంది ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకి అవుటైతే, నెక్ట్స్ మ్యాచ్‌లో కూడా ఫెయిల్ అవుతామేమో అని భయపడతారు. కానీ విరాట్ అలా కాదు, ఈసారి బాగా ఆడలేదంటే, తర్వాతి మ్యాచ్‌లో ఇంకా బాగా ఆడాలని కోరుకుంటాడు..
ఇలాంటి మైండ్‌సెట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అతనిలో ఉన్న ఆ కసి, విరాట్ కోహ్లీని చాలా స్పెషల్ ప్లేయర్‌గా మార్చింది. అప్పుడే నాకు అనిపించింది, విరాట్ చాలా సాధిస్తాడని! ఇప్పుడు అతన్ని ఇలా చూస్తుంటే గర్వంగా ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్..