ఇది ‘కింగ్’ కోహ్లీ రూల్... వన్డేల్లో 47వ సెంచరీలతో ‘పది’ రికార్డుల దుమ్ము దులిపిన విరాట్ కోహ్లీ...
మూడేళ్ల పాటు సెంచరీ చేయలేదన్న ఆకలిని కసిగా మార్చుకుని... సెంచరీల మోత మోగిస్తూ సాగుతున్నాడు విరాట్ కోహ్లీ. తన 500వ అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌పై సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ... ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో పాక్‌పై సెంచరీలతో రికార్డుల మోత మోగించాడు..
KL Rahul-Virat Kohli
55 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, 84 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. వన్డేల్లో 267 ఇన్నింగ్స్‌ల్లో 47వ సెంచరీ అందుకున్నాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్‌కి 47వ వన్డే సెంచరీ అందుకోవడానికి 435 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి..
Virat_Rahul
ఓవరాల్‌గా విరాట్ కోహ్లీకి ఇది 77వ అంతర్జాతీయ సెంచరీ. విరాట్ కోహ్లీ 561 ఇన్నింగ్స్‌ల్లో 77 సెంచరీలు పూర్తి చేస్తే, సచిన్ టెండూల్కర్‌కి 593 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి...
మూడో స్థానంలో 14 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇంతకుముందు రికీ పాంటింగ్ 22869, కుమార సంగర్కర 22011, కేన్ విలియంసన్ 14591, రాహుల్ ద్రావిడ్ మూడో స్థానంలో 14555 పరుగులు చేసి విరాట్ కంటే ముందున్నారు. అయితే అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న ప్లేయర్ విరాట్ కోహ్లీ..
వన్డే ఆసియా కప్‌లో 150+ భాగస్వామ్యాలు నమోదు చేయడం విరాట్ కోహ్లీకి నాలుగోసారి. సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, సురేష్ రైనా రెండేసి సార్లు ఈ ఫీట్ సాధించారు..
వన్డేల్లో 13 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. అత్యంత వేగంగా ఈ మైలురాయి అందుకున్న ప్లేయర్‌గా నిలిచాడు కోహ్లీ. విరాట్ 267 ఇన్నింగ్స్‌ల్లో వన్డేల్లో 13 వేల పరుగులు అందుకుంటే, సచిన్ టెండూల్కర్ 321, రికీ పాంటింగ్ 241, కుమార సంగర్కర 363, సనత్ జయసూర్య 416 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ అందుకున్నారు.
కొలంబోలో విరాట్ కోహ్లీకి ఇది వరుసగా నాలుగో వన్డే సెంచరీ. ఇంతకుముందు బంగ్లాదేశ్, మీర్‌పూర్‌లోని షేర్ బంగ్లాలో నాలుగు సెంచరీలు చేశాడు విరాట్ కోహ్లీ. ట్రిడినాడ్, విశాఖపట్నం నగరాల్లో మూడేసి సెంచరీలు చేశాడు విరాట్ కోహ్లీ.
ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీకి ఇది ఐదో సెంచరీ. సనత్ జయసూర్య 6 సెంచరీలతో టాప్‌లో ఉంటే, విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు. కుమార సంగర్కర 4, షోయబ్ మాలిక్ 3 సెంచరీలు చేశారు..
విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ కలిసి మూడో వికెట్‌కి అజేయంగా 233 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆసియా కప్ చరిత్రలో ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు 2012లో మహ్మద్ హఫీజ్, జంఝెడ్ కలిసి జోడించిన 224 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసింది కోహ్లీ, రాహుల్ జోడి..
వన్డేల్లో అజేయ సెంచరీతో నిలవడం విరాట్ కోహ్లీకి ఇది 17వ సారి. సచిన్ టెండూల్కర్ 15 సార్లు సెంచరీ తర్వాత నాటౌట్‌గా నిలవగా ఏబీ డివిల్లియర్స్ 12 సార్లు అజేయ సెంచరీ చేశాడు..
virat kohli batting
వన్డేల్లో 120+ స్ట్రైయిక్ రేటుతో సెంచరీ చేయడం విరాట్‌కి ఇది 15వ సారి. ఏబీ డివిల్లియర్స్ 13 సార్లు,వీరేంద్ర సెహ్వాగ్, సనత్ జయసూర్య 10 సార్లు ఈ ఫీట్ సాధించారు.
వన్డేల్లో 300+ టీమ్ స్కోరులో విరాట్ కోహ్లీకి ఇది 23వ సెంచరీ. సచిన్ టెండూల్కర్ 19 సార్లు, ఏబీ డివిల్లియర్స్, రోహిత్ శర్మ 16 సార్లు సెంచరీతో టీమ్ స్కోరుని 300 పరుగులు దాటించారు.