- Home
- Sports
- Cricket
- కోహ్లీ నుంచి ఆ ఇన్నింగ్స్ ఇంకా బాకీ ఉంది.. పాక్‌లో విరాట్ డూప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కోహ్లీ నుంచి ఆ ఇన్నింగ్స్ ఇంకా బాకీ ఉంది.. పాక్‌లో విరాట్ డూప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Virat Kohli: రన్ మిషీన్ విరాట్ కోహ్లీ నుంచి బెస్ట్ ఇన్నింగ్స్ ఎన్నో వచ్చాయి. తన సుదీర్ఘ కెరీర్ లో కోహ్లీ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఎన్నో ఆడాడు.

రన్ మిషీన్, ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లీ భారత క్రికెట్ లో ఎత్తుపల్లాలను చూశాడు. తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా ఛేదనలో ఒత్తిడిని తట్టుకుంటూ ఆటడటంలో కోహ్లీ శైలే వేరు . అదే అతడిని ప్రపంచ క్రికెట్ లో స్టార్ గా నిలబెట్టింది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం గతేడాది మెల్‌బోర్న్ లో పాకిస్తాన్ పై కోహ్లీ ఇన్నింగ్స్.
అయితే తన కెరీర్ లో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడినా కోహ్లీ నుంచి బెస్ట్ ఇన్నింగ్స్ ఇంకా రాలేదని పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షెహ్‌జాద్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చూడటానికి అచ్చం కోహ్లీలా ఉండే అతడిని పాక్ అభిమానులు విరాట్ డూప్ గా పిలుచుకుంటారు. ఈ ఇద్దరూ అండర్ - 19 ఆడినప్పట్నుంచీ మంచి మిత్రులు.
తాజాగా షెహ్‌జాద్ కోహ్లీతో స్నేహం గురించి మాట్లాడుతూ.. ‘అండర్-19 ప్రపంచకప్ (2008లో) నుంచి నాకు కోహ్లీతో పరిచయం ఉంది. మేం ఇద్దరం ఒకరినొకరం మా అనుభవానులను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం. క్రికెట్ కు సంబంధించిన ఎలాంటి సలహా అడిగినా కోహ్లీ తప్పకుండా సాయం చేస్తాడు.
ఒక ఆటగాడిగా నేను ఎప్పుడూ కోహ్లీని గౌరవిస్తా. ఆటలో వచ్చిన మార్పులను గమినించి తన ఆటను కూడా నిరంతరం మార్చుకుంటూ ముందుకు సాగుతున్న అతడి డెడికేషన్ కు నేను వీరాభిమానిని. ఆట పరంగా అండర్ - 19 ఆడేప్పుడు అతడు ఎంత ఉత్సాహంగా ఉండేవాడో ఇప్పుడూ అదే ఉత్సాహంతో ఉన్నాడు.
భారత టెస్టు క్రికెట్ స్థాయిని పెంచింది కోహ్లీ అనడంలో సందేహమే లేదు. అతడు దానిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. అయితే విరాట్ నుంచి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇంకా బాకీ ఉంది. త్వరలోనే అది వస్తుందని నేను ఆశిస్తున్నా..’అని చెప్పాడు.
కాగా 2008 లో ఈ ఇద్దరూ అండర్ - 19 ప్రపంచకప్ ఆడారు. అప్పుడు కోహ్లీ ఇండియా కెప్టెన్ కాగా షెహ్‌జాద్ పాకిస్తాన్ సారథిగా ఉన్నాడు. 2009 లో 17 ఏండ్లకే పాకిస్తాన్ జట్టులోకి వచ్చిన అహ్మద్.. టాపార్డర్ లో బ్యాటింగ్ కు వచ్చేవాడు. పాకిస్తాన్ తరఫున అతడు 13 టెస్టులు, 81 వన్డేలు, 59 టీ20లు ఆడాడు. 2016లో టీ20 వరల్డ్ కప్ అనంతరం అతడిపై వేటు పడింది. చివరిసారి 2019 లో పాక్ తరఫున టీ20 ఆడిన షెహజాద్ ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.