ధోనీ, రోహిత్ శర్మ, మోర్గాన్... ఇప్పుడు విరాట్ కోహ్లీ... రవీంద్ర జడేజా కారణంగా ఆర్‌సీబీ కెప్టెన్‌కి..

First Published Apr 26, 2021, 4:58 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో కెప్టెన్లకు జరిమానాల బెడద తప్పడం లేదు. తాజాగా స్లో ఓవర్ రేటు కారణంగా ఫైన్ కట్టిన కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లీ కూడా చేరిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా విరాట్ కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధించింది ఐపీఎల్ యాజమాన్యం.