MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Sports
  • Cricket
  • Ishan Kishan: బ్యాంకు ఉద్యోగిగా మారిన టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్.. నెలకు జీతం ఎంతంటే?

Ishan Kishan: బ్యాంకు ఉద్యోగిగా మారిన టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్.. నెలకు జీతం ఎంతంటే?

Ishan Kishan : టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆర్‌బీఐ అసిస్టెంట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఐడీ కార్డు ధరించి ఆఫీసులో కనిపించిన ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇషాన్ కిషన్ నెల జీతం ఎంతో తెలుసా?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 05 2026, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బ్యాంక్ ఆఫీసులో ప్రత్యక్షమైన క్రికెటర్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్!
Image Credit : X/venkymama100

బ్యాంక్ ఆఫీసులో ప్రత్యక్షమైన క్రికెటర్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్!

మైదానంలో తన ధనాధన్ బ్యాటింగ్‌తో సిక్సర్ల వర్షం కురిపించే టీమిండియా యంగ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చాడు. అయితే ఈసారి అతడు వికెట్ల వెనక చేసిన కీపింగ్ వల్లో లేక స్టేడియంలో బాదిన సెంచరీ వల్లో వార్తల్లో నిలవలేదు. ఏకంగా ఒక బ్యాంక్ ఆఫీసులో ఫార్మల్ డ్రెస్సింగ్, మెడలో ఐడీ కార్డుతో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచాడు.

బీహార్ రాజధాని పట్నాలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రీజనల్ ఆఫీస్‌లో ఇషాన్ కిషన్ సీరియస్‌గా విధులు నిర్వర్తిస్తూ కనిపించాడు. అక్కడి బ్యాంక్ సిబ్బందితో కలిసి డిపాజిట్లు, రుణాలు, ఇతర అధికారిక ఫైళ్లను పరిశీలిస్తూ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ పిక్స్ చూసిన అభిమానులు ఇషాన్ ఏమైనా సడన్‌గా క్రికెట్‌కు గ్యాప్ ఇచ్చి బ్యాంక్ ఉద్యోగంలో సెటిల్ అయ్యాడా అని షాక్ తింటున్నారు.

Ishan Kishan at Reserve Bank of India Patna 🔥

- Cricket off season, Banking job for Ishan. pic.twitter.com/ayrq1Chybq

— Johns. (@CricCrazyJohns) August 5, 2026

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆర్‌బీఐలో ఉద్యోగం ఎలా వచ్చింది? జీతం ఎంతంటే?
Image Credit : X/BCCI

ఆర్‌బీఐలో ఉద్యోగం ఎలా వచ్చింది? జీతం ఎంతంటే?

ఈ వైరల్ ఫొటోల వెనుక ఉన్న అసలు మేటర్ ఏంటంటే.. ఇషాన్ కిషన్‌కు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్పోర్ట్స్ కోటా కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 'అసిస్టెంట్ మేనేజర్'గా ఉద్యోగం లభించింది. రీసెంట్‌గా టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన రెండు టెస్టుల సిరీస్‌లో ఇషాన్‌కు స్థానం దక్కలేదు. దీంతో దాదాపు నెల రోజులకు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లేవీ లేకపోవడంతో, లభించిన ఈ ఖాళీ సమయాన్ని వేస్ట్ చేయకుండా పట్నాలోని ఆర్‌బీఐ ఆఫీసుకు వెళ్లి తన అధికారిక బాధ్యతలను నిర్వర్తించాడు.

బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ హోదాలో పనిచేసే ఉద్యోగులకు నెలకు దాదాపు రూ. 1.22 లక్షల నుంచి రూ. 1.24 లక్షల వరకు గ్రాస్ సాలరీ ఉంటుంది. పీఎఫ్, టాక్స్‌లు, ఇతర కటింగ్స్ పోను ప్రతినెలా నికరంగా రూ. 1.08 లక్షల నుంచి రూ. 1.12 లక్షల వరకు ఇన్-హ్యాండ్ జీతం లభిస్తుంది. ప్రస్తుతం ఇషాన్ కిషన్ కూడా ఇదే హోదాలో విధులు నిర్వర్తిస్తుండటంతో అతనికి కూడా ఇదే స్థాయిలో వేతనం అందుతోంది.

🚨 ISHAN KISHAN WORKING AS A BANKER 🤯

Ishan Kishan has been keeping busy away from the cricket field these days by taking up a regular job at a local bank in Jharkhand, handling customer accounts and paperwork while the Indian team has no matches scheduled. With the… pic.twitter.com/RLdT1CTr1H

— Venky Mama (@venkymama100) August 4, 2026

34
గ్రౌండ్‌లోనే కాదు.. డెస్క్ జాబ్‌లోనూ తగ్గేదేలే
Image Credit : X/BCCI

గ్రౌండ్‌లోనే కాదు.. డెస్క్ జాబ్‌లోనూ తగ్గేదేలే

బ్యాంక్ ఆఫీస్‌కు వచ్చిన ఇషాన్ కిషన్‌ను చూసి తోటి సిబ్బంది, ఇతర ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్ పనివేళల్లో అతడితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. ఇషాన్ కూడా ఎంతో వినయంగా వారితో కలిసి గ్రూప్ ఫొటోలు దిగాడు. కోట్లాది రూపాయల ఐపీఎల్ కాంట్రాక్టులు, జాతీయ జట్టులో స్టార్ డమ్ ఉన్నప్పటికీ.. తనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఎంతో బాధ్యతగా గుర్తుంచుకుని ఆఫీసుకు రావడంపై నెటిజన్లు ఇషాన్ కిషన్ నిబద్ధతను ప్రశంసిస్తున్నారు.

గతంలో టీమిండియా లెజెండ్స్ మహేంద్రసింగ్ ధోనీ, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు కూడా క్రీడా కోటా ఉద్యోగాల్లో కొనసాగుతూనే జాతీయ జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించారు. స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చే ఉద్యోగాల్లో ప్రాక్టీస్ చేయడానికి, టోర్నమెంట్లలో పాల్గొనడానికి పూర్తి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఉద్యోగం చేయడం వల్ల ఇషాన్ క్రికెట్ కెరీర్‌కు ఎలాంటి ఆటంకం కలగదు.

44
ఇషాన్ కిషన్ నెక్స్ట్ క్రికెట్ షెడ్యూల్ ఇదే
Image Credit : Getty

ఇషాన్ కిషన్ నెక్స్ట్ క్రికెట్ షెడ్యూల్ ఇదే

ప్రస్తుతం లభించిన చిన్న బ్రేక్‌ను బ్యాంక్ ఉద్యోగానికి కేటాయించినప్పటికీ.. ఇషాన్ చూపు మాత్రం మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడంపైనే ఉంది. అంతర్జాతీయ స్థాయిలో 2022లో బంగ్లాదేశ్‌పై వన్డేల్లో అత్యంత పిన్న వయస్కుడిగా డబుల్ సెంచరీ కొట్టి రికార్డు సృష్టించిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఇటీవల టీ20 ప్రపంచకప్‌లోనూ, ఆ తర్వాత ఐపీఎల్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో మంచి ప్రదర్శన ఇచ్చాడు.

ఆగస్ట్ 23 నుంచి ప్రారంభం కానున్న 'దులీప్ ట్రోఫీ 2026'లో ఈస్ట్ జోన్ టీమ్‌కు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టుకు 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. మొదటి మ్యాచ్‌లో నార్త్ జోన్‌తో ఈస్ట్ జోన్ తలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌తో ఇషాన్ మళ్లీ టీమిండియా బ్లూ జెర్సీలో మైదానంలో సందడి చేయనున్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Preity Zinta Brett Lee: ప్రీతి జింటాతో సీక్రెట్ లవ్? 16 ఏళ్ల తర్వాత షాకింగ్ నిజం చెప్పిన బ్రెట్ లీ
Recommended image2
Ajinkya Rahane: అజింక్య రహానేకు బీసీసీఐ నెలనెలా పెన్షన్.. ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved