- Home
- Sports
- Cricket
- కోహ్లీ, హార్ధిక్ పాండ్యా... ప్రోటోకాల్ ఉల్లంఘించారా?... హడావుడి చేస్తున్న ఆసీస్ మీడియా...
కోహ్లీ, హార్ధిక్ పాండ్యా... ప్రోటోకాల్ ఉల్లంఘించారా?... హడావుడి చేస్తున్న ఆసీస్ మీడియా...
బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టుకి దక్కిన విజయాన్ని ఆస్ట్రేలియా జీర్ణించుకోలేకపోతోంది. అందుకే భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో కోవిద్ నిబంధనలను పట్టించుకోవడం లేదని తెగ హడావుడి చేస్తోంది ఆస్ట్రేలియా మీడియా. రోహిత్ శర్మతో కలిసి మరో నలుగురు క్రికెటర్లు న్యూఇయర్ పార్టీ పేరుతో రెస్టారెంట్‌లో విందు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోటో ఓ అభిమాని పోస్టు చేయడంతో మొదలైన రచ్చ, ఇప్పటికే ఇండియాకి తిరిగి వచ్చేసిన కెప్టెన్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాల పాత ఫోటోలను బయటికి తీసేదాకా వెళ్లింది.

వన్డే సిరీస్ ముగిసిన తర్వాత భారత సారథి విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కలిసి ఓ బేబీ కేర్ సెంటర్‌కి వెళ్లి షాపింగ్ చేశారు...

పుట్టబోయే తన బిడ్డ కోసం విరాట్ షాపింగ్ చేయగా, హార్దిక్ పాండ్యా తన కొడుకు అగస్త్య కోసం కొన్ని వస్తువులను కొనుగోలు చేశాడు...

ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాలో షాపింగ్ చేస్తున్న ఫోటోలు, అప్పుడే బయటికి వచ్చాయి. అప్పుడు ఆస్ట్రేలియా వీటిని అస్సలు పట్టించుకోలేదు...

బాక్సింగ్ డే విజయం తర్వాత ఈ ఫోటోలను చూపిస్తూ... భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో కోవిద్ నిబంధనలను పట్టించుకోవడం లేదని తెగ హడావుడి చేస్తోంది...

బేబీ కేర్ స్టోర్‌లో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఇద్దరూ మాస్కులు ధరించకుండా ఫోటోలను ఫోజిలిచ్చారు... దీంతో ఈ ఇద్దరూ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి నడుచుకున్నారని ఓ పత్రిక కథనం ప్రచురించింది.

అంతేకాకుండా ఆడిలైడ్‌లో కొందరు భారత ఆటగాళ్లు ప్రొటోకాల్‌కి విరుద్ధంగా నడుచుకున్నారని కూడా ఈ కథనంలో రాసుకొచ్చింది...

రెడ్ జోన్‌లో ఉన్న ‘వాఫెల్ అండ్ కాఫీ’ అనే రెస్టారెంట్‌కి కొందరు భారత ఆటగాళ్లు వెళ్లారని, అక్కడ బయట టేబుల్ మీద కూర్చుని ఆరగించారని ఈ కథనంలో పేర్కొంది...

రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, నవ్‌దీప్ సైనీ, పృథ్వీషా కలిసి న్యూఇయర్ రోజున ఇలా పార్టీకి వెళ్లడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

ఈ ఐదుగురు క్రికెటర్లను ప్రత్యేకంగా ఐసోలేషన్‌కి తరలించడమే కాకుండా కరోనా పరీక్షలు కూడా చేశారు. కరోనా టెస్టులో నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇంతా చేసి, ఈ రెస్టారెంట్‌కి వెళ్లేందుకు టీమిండియాకి అనుమతి ఉందని తేలింది. మూడో టెస్టుకి ముందు రోహిత్ శర్మ అండ్ కో ఆత్మవిశ్వాసం దెబ్బ తీసేందుకే ఇలాంటి కథనాలు రాసుకొస్తున్నారని టీమిండియా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.