- Home
- Sports
- Cricket
- కోహ్లీకి వీరాభిమానిని! అయినా కొన్నిసార్లు అలా చేయక తప్పదు... విరాట్‌తో గొడవపై కైల్ మేయర్స్ కామెంట్..
కోహ్లీకి వీరాభిమానిని! అయినా కొన్నిసార్లు అలా చేయక తప్పదు... విరాట్‌తో గొడవపై కైల్ మేయర్స్ కామెంట్..
ఐపీఎల్ 2023 సీజన్ అంతా ఓ ఎత్తు అయితే, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య లక్నోలో మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ, నవీన్ వుల్ హక్ మధ్య జరిగిన గొడవ మరో ఎత్తు. ఈ మ్యాచ్‌లో నడిచిన హై డ్రామా, ఇప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్‌కి గుర్తుండిపోయి ఉంటుంది..

బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఆర్‌సీబీపై ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి గెలిచింది. ఈ మ్యాచ్ తర్వాత గౌతమ్ గంభీర్, బెంగళూరు ఫ్యాన్స్‌ని సైలెంట్‌గా ఉండాలంటూ నోరు చూపించడం హాట్ టాపిక్ అయ్యింది...
లక్నోలో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ, ఎల్‌ఎస్‌జీపై రివెంజ్ తీర్చుకుంది. ఈ మ్యాచ్ సమయంలో ఆఫ్ఘాన్ ప్లేయర్ నవీన్ వుల్ హక్‌ని సెడ్జ్ చేయడం, బూటు కింద దూళిని చూపిస్తూ సైగలు చేయడం పెద్ద చిచ్చు రేపింది...
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీతో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ కైల్ మేయర్స్ ఏదో మాట్లాడుతుండడం, ఆ సమయంలో అక్కడికి వచ్చిన గౌతమ్ గంభీర్ అతన్ని పక్కకు తీసుకెళ్లడం జరిగిపోయాయి. దీంతో విరాట్ కోహ్లీ, లక్నో డగౌట్‌కి వెళ్లి, గంభీర్‌తో వాగ్వాదానికి దిగాడు... మ్యాచ్ చప్పగా సాగినా, మ్యాచ్ అనంతరం చాలా పెద్ద హై డ్రామా నడిచింది...
తాజాగా ఈ గొడవపై కామెంట్ చేశాడు వెస్టిండీస్ ఓపెనర్ కైల్ మేయర్స్. ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ... ఈ ఇద్దరిలో ఎవరి వికెట్ తీయడం చాలా ముఖ్యం?’ అనే ప్రశ్నకు ‘విరాట్ కోహ్లీయే’ అంటూ సమాధానం ఇచ్చాడు కైల్ మేయర్స్. ‘కచ్ఛితంగా విరాట్ కోహ్లీ. కోహ్లీ లాంటి ప్లేయర్‌ని త్వరగా అవుట్ చేయాలని ఏ టీమ్ అయినా కోరుకుంటుంది?’ అంటూ వ్యాఖ్యానించాడు మేయర్స్..
gambhir kohli chant
‘ఐపీఎల్ సమయంలో విరాట్ కోహ్లీతో నీకు చిన్న గొడవ అయినట్టుంది? గేమ్ విషయంలో అతని అగ్రెషన్ గురించి ఏమంటావ్?’ అని అడిగిన ప్రశ్నకు కూడా కైల్ మేయర్స్, ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పాడు...
Image credit: PTI
‘విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ ప్లేయర్. ఆయన అగ్రెషన్‌కి చాలా పెద్ద ఫ్యాన్‌ని. కొన్నిసార్లు ప్రత్యర్థిపై పైచేయి సాధించడానికి అగ్రెషన్ అవసరం అవుతుంది. అగ్రెసివ్‌గా ఉండడం వల్ల మిగిలిన ప్లేయర్లలోనూ ఉత్సాహం, జోష్ పెరుగుతుంది. టీమ్ గెలుపు కోసం ఏం చేయడానికైనా విరాట్ వెనకాడడు..’ అంటూ కామెంట్ చేశాడు కైల్ మేయర్స్..