- Home
- Sports
- Cricket
- కెఎల్ రాహుల్ విషయంలో తగ్గని వెంకటేశ్ ప్రసాద్... 8 ఏళ్లుగా టీమ్‌లో ఉండి ఏం సాధించాడంటూ...
కెఎల్ రాహుల్ విషయంలో తగ్గని వెంకటేశ్ ప్రసాద్... 8 ఏళ్లుగా టీమ్‌లో ఉండి ఏం సాధించాడంటూ...
టీమిండియా మేనేజ్‌మెంట్‌కి కెఎల్ రాహుల్ అంటే ఎంతో అభిమానం. అతను ఎన్ని సార్లు అట్టర్ ఫ్లాప్ అయినా వరుస అవకాశాలు దక్కించుకుంటూనే ఉన్నాడు. ఈ విషయంలో టీమిండియాని ఏకిపారేస్తున్నాడు భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్...

కెఎల్ రాహుల్ టెస్టు టీమ్‌లో ఉండడానికి పనికి రాడని వెంకటేశ్ ప్రసాద్ చేసిన కామెంట్లకు ఆకాశ్ చోప్రా భిన్నంగా స్పందించాడు. కెఎల్ రాహుల్ టీమ్‌లో ఉండాల్సిందేనంటూ విదేశాల్లో అతని టెస్టు రికార్డులను ప్రస్తావించాడు. దీనిపై వెంకటేశ్ ప్రసాద్ మరింత ఘాటుగా ప్రతిస్పందించాడు..
KL Rahul
‘నా స్నేహితుడు ఆకాశ్ చోప్రా, యూట్యూబ్‌లో ఈ రోజు ఓ వీడియో చేశాడు. నేను ఓ ఎజెండా ప్రకారం మాట్లాడుతున్నానని, నాకు కెఎల్ రాహుల్ అంటే అస్సలు పడదని తప్పుగా మాట్లాడాడు. నాకు ఒకటి తెలియక అడుగుతున్నా మయాంక్ అగర్వాల్‌కి స్వదేశంలో 70 యావరేజ్ ఉంది. రెండు డబుల్ సెంచరీలు కూడా బాదాడు. అయినా అతన్ని ఎందుకు పక్కనబెట్టారు..
KL Rahul-Dravid
ఆకాశ్ చోప్రా ఉద్దేశంలో రోహిత్ శర్మ కూడా రిజర్వు బెంచ్‌లో కూర్చోవాలి. నాకు ఎలాంటా ఎజెండా లేదు. భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. కానీ కావాలని నీ యూట్యూబ్ వ్యూస్ కోసం ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు...
Image credit: Getty
నాకు కెఎల్ రాహుల్‌పైన ఎలాంటి పగ లేదు. మరే ప్లేయర్ పైనా లేదు. నా ఉద్దేశం ఒక్కటే టీమ్ సెలక్షన్ న్యాయంగా జరగాలి. పర్ఫామెన్స్ ఆధారంగా ప్లేయర్లకు టీమ్‌లో చోటు ఉండాలి. సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్‌లను ఎందుకు పట్టించుకోవడం లేదు...
Image credit: Getty
రోహిత్‌కి 24 ఏళ్లు ఉన్నప్పుడు, 4 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కూడా లేనప్పుడు ఇదే ఆకాశ్ చోప్రా, అతను టీమ్‌లో ఉండడానికి పనికి రాడని అన్నాడు. టాలెంట్ లేదని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. 8 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఆడిన తర్వాత 31 ఏళ్ల కెఎల్ రాహుల్ ఏం సాధించాడు..
KL Rahul
నేను ఏ ప్లేయర్‌ని తిట్టాలని కానీ లేదా వ్యక్తిగతంగా దూషించాలని కానీ అనుకోవడం లేదు. కేవలం అతని పర్ఫామెన్స్ బాగా లేకున్నా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తున్నా... మ్యాచ్ తర్వాత ఎవరేం మాట్లాడరని ఏ ప్లేయర్ కూడా పట్టించుకోడు... కానీ పట్టించుకుంటే తన తప్పులు తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది..
ఆకాశ్ చోప్రా చాలా కష్టపడి యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు. తన ఛానెల్‌కి వ్యూస్ రావాలని ఎంతో తపన పడుతున్నాడు. కానీ ఇలా వేరే వాళ్లను తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు...’ అంటూ వరుస ట్వీట్లు వేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్..
Aakash Chopra-Venkatesh Prasad
విషయం అటు తిరిగి ఇటు తిరిగి తనపైకి రావడంతో ఆకాశ్ చోప్రా శాంతి ఒప్పందం చేసుకుందామని ట్వీట్ చేశాడు. ‘వెంకీ భాయ్.. మీరు పెడుతున్న మెసేజ్‌లకు అర్థం మారిపోతోంది. మీరు ఇక్కడ, నేను యూట్యూబ్‌లో.. ఇలా కాదు, మీరు వీడియో ఛాట్‌కి రండి. ఓ లైవ్ చేద్దాం. భిన్నాభిప్రాయాలు ఉండడం మంచిదే. దాన్ని సరిగ్గా చర్చిద్దాం.. నాకు స్పాన్సర్లు ఎవ్వరూ లేరు. నేను దీని ద్వారా డబ్బులు ఏమీ సంపాదించడం లేదు.. నా నెంబర్ మీ దగ్గర ఉందనుకుంటా.. ఫోన్ చేయండి..’ అంటూ ట్వీట్ చేశాడు ఆకాశ్ చోప్రా..
ఇంత రచ్చ జరిగిన తర్వాత కెఎల్ రాహుల్‌కి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మూడో టెస్టు చోటు దక్కితే... వెంకటేశ్ ప్రసాద్‌తో పాటు అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది..