అట్టర్ ఫ్లాప్ అయినా సూర్యకుమార్ యాదవ్‌కి వరుస ఛాన్సులు... సంజూ శాంసన్‌ని పట్టించుకోని టీమిండియా...
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు సూర్యకుమార్ యాదవ్. అయితే వన్డేల్లో మాత్రం అతని పర్ఫామెన్స్ ఏ మాత్రం సరిగా లేదు. ఐపీఎల్ 2023 టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో డకౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్..
Image credit: PTI
టీ20ల్లో 48 మ్యాచుల్లో 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు చేసి 46.52 సగటుతో 1675 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో 23 మ్యాచులు ఆడి రెండే హాఫ్ సెంచరీలు బాదాడు. ఇందులో రెండో మ్యాచ్‌లో వచ్చిన హాఫ్ సెంచరీ పోగా మిగిలిన 21 మ్యాచుల్లో చేసింది ఒకే ఒక్క హాఫ్ సెంచరీ...
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో మొట్టమొదటి బంతికే డకౌట్ అయి, ఈ చెత్త రికార్డు నమోదు చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నా సూర్యకుమార్ యాదవ్‌కి మరో ఛాన్స్ ఇచ్చింది టీమిండియా..
Suryakumar Yadav
వెస్టిండీస్‌లో జరుగుతున్న తొలి వన్డేలో సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం దక్కింది. ఇదే సమయంలో వన్డేల్లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్న సంజూ శాంసన్‌ని పక్కన బెట్టేసింది టీమిండియా మేనేజ్‌మెంట్..
2021లో శ్రీలంకపై వన్డే ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్, 11 మ్యాచుల్లో 66 సగటుతో 330 పరుగులు చేశాడు. గత ఏడాది వన్డేల్లో బెస్ట్ సగటు మెయింటైన్ చేసిన భారత బ్యాటర్ సంజూయే...
అయితే ఇషాన్ కిషన్ కోసం సంజూని పక్కనబెట్టేసింది టీమిండియా. ఇషాన్ కిషన్, 14 వన్డేల్లో 42.5 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో బంగ్లాదేశ్‌పై చేసిన డబుల్ సెంచరీ కూడా ఉంది...
డబుల్ సెంచరీ తర్వాత కూడా శుబ్‌మన్ గిల్ కారణంగా రిజర్వు బెంచ్‌కే పరిమితమైన ఇషాన్ కిషన్, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్‌లో ఆడిన మ్యాచుల్లో ఇషాన్ కిషన్ నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రాలేదు...
Suryakumar Yadav
మొత్తానికి వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నా, టీ20ల్లో చూపిస్తున్న పర్ఫామెన్స్ కారణంగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో సూర్యకుమార్ యాదవ్‌ని ఎలాగైనా ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది..
కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌ల మోజులో వన్డేల్లో బాగా ఆడుతున్న సంజూ శాంసన్‌కి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు దక్కడం అనుమానమే. చోటు దక్కినా స్టాండ్ బై వికెట్ కీపర్‌గా మాత్రమే సంజూని తీసుకోవచ్చు...