MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • లవ్ కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నానంటూ ఊర్వశి పోస్టు... కంగారుపడుతున్న పంత్! ఆ పాక్ క్రికెటర్ కూడా...

లవ్ కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నానంటూ ఊర్వశి పోస్టు... కంగారుపడుతున్న పంత్! ఆ పాక్ క్రికెటర్ కూడా...

ఊర్వశి రౌతెల్లా తన నటన ద్వారా ఎంత మంది ఫాలోవర్లను సంపాదించుకుందో తెలీదు కానీ క్రికెటర్ రిషబ్ పంత్‌తో గొడవతో సోషల్ మీడియాలో కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంది. రిషబ్ పంత్ తనకోసం వారణాసి వచ్చి 10 గంటల పాటు వెయిట్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేసిన ఊర్వశి, తాజాగా తన ప్రియుడి కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నానంటూ పోస్టు చేసి రచ్చ లేపింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 09 2022, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇన్‌స్టాగ్రామ్‌లో రచ్చ రేగిన తర్వాత యూఏఈలో జరిగిన ఆసియా కప్ 2022 మ్యాచులకు హాజరైంది ఊర్వశి రౌతెల్లా. భారత జట్టు ఆడిన మ్యాచ్‌లకు అభిమానులను ఉత్సాహపరిచింది. ఆ తర్వాత ఇండియాలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ మ్యాచులకు కూడా వచ్చి సందడి చేసింది ఊర్వశి రౌతెల్లా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇప్పుడు తన ప్రేమను అనుసరిస్తూ ఆస్ట్రేలియా వెళ్తున్నట్టు ఊర్వశి రౌతెల్లా చేసిన పోస్టు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యింది. ‘ఫాలోడ్ మై లవ్, ఆస్ట్రేలియాకి వెళ్తున్నా...’ అంటూ పోస్ట్ చేసింది ఊర్వశి రౌతెల్లా. ఇందులో లవ్ ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది...

38

ఊర్వశి రౌతెల్లాని సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడు క్రికెటర్ రిషబ్ పంత్. అయితే ఊర్వశి మాత్రం రిషబ్ పంత్‌పై తనకున్న ప్రేమను సాధ్యమైనప్పుడల్లా బయటపెడుతూనే వచ్చింది. అయితే ఓ ఇంటర్వ్యూలో ‘మిస్టర్ ఆర్‌పీ’ అంటూ ఊర్వశి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.

48

‘కొందరు క్రేజ్ కోసం ఎంతకైనా దిగజారతారు... ఓ అక్కా నన్ను వదిలేయ్’ అంటూ రిషబ్ పంత్ పోస్ట్ చేయడం, దానికి ఊర్వశి... ‘కాస్త ఎదుగు తమ్ముడూ...’ అంటూ ఊర్వశి రిప్లై ఇవ్వడంతో... ఇద్దరు సెలబ్రిటీల మధ్య ‘నిబ్బా.. నిబ్బీ’ స్టైల్‌లో వార్ నడిచింది...

58

ఆ తర్వాత ఆసియా కప్ 2022 టోర్నీలో పాక్ క్రికెటర్ నసీం షా నవ్వుతున్న వీడియోను, తన వీడియోని జోడించి పోస్టు చేసింది ఊర్వశి రౌతెల్లా. రిషబ్ పంత్ పట్టించుకోకపోవడంతో ఈ బాలీవుడ్ బ్యూటీ, పాక్ క్రికెటర్‌పై మనసు పారేసుకుందని వార్తలు వచ్చాయి...

68

నసీం షాకి ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి గురించి ప్రశ్న కూడా ఎదురైంది. అయితే ఆ కుర్రాడు... ‘ఊర్వశి రౌతెల్లా ఎవరో కూడా నాకు తెలీదు... మొదటి సారి ఆ పేరు వింటున్నా’ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత ఊర్వశిని సోషల్ మీడియాలో ఫాలో చేసి, వెంటనే అన్‌ఫాలో చేశాడు...

78
Rishabh Pant vs Urvashi Rautela

Rishabh Pant vs Urvashi Rautela

ఇప్పుడు ఊర్వశి రౌతెల్లా ఆస్ట్రేలియాకి ప్రేమను వెతుక్కుంటూ వెళ్తోంది మాజీ ప్రేమికుడని చెప్పుకునే రిషబ్ పంత్ కోసమా... లేక కొత్త ప్రేమికుడని చెప్పుకుంటున్న నసీం షాని వెతుక్కుంటూ వెళ్తోందా... అనేది ఇన్‌స్టా యూజర్లకు కూడా అంతుచిక్కని ప్రశ్నలా మారింది.. 

88

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుంది. దినేశ్ కార్తీక్ రూపంలో సీనియర్ వికెట్ కీపర్ కూడా టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉండడంతో రిషబ్ పంత్‌కి తుది జట్టులో చోటు దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది...
 

About the Author

CR
Chinthakindhi Ramu
రిషబ్ పంత్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rohit Sharma: లార్డ్స్‌లో హిట్‌మ్యాన్ విశ్వరూపం.. సచిన్, గంగూలీ రికార్డులు బద్దలుకొట్టిన రోహిత్ శర్మ
Recommended image2
Yuvraj Singh: లార్డ్స్‌లో యువరాజ్ సింగ్‌కు అరుదైన గౌరవం.. దిగ్గజాల క్లబ్‌లో చేరిన సిక్స్ సిక్సర్ కింగ్
Recommended image3
Rohit Sharma Records: లార్డ్స్ లో రోహిత్ శర్మ తుపాను.. చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని వరల్డ్ రికార్డ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved