- Home
- Sports
- Cricket
- రవిశాస్త్రి కోచింగ్‌లో ఆస్ట్రేలియాలో ఆసీస్‌కి దడ పుట్టించిన టీమ్ ఇదేనా! ద్రావిడ్ కోచింగ్‌లో టీమ్ పయనమెటు...
రవిశాస్త్రి కోచింగ్‌లో ఆస్ట్రేలియాలో ఆసీస్‌కి దడ పుట్టించిన టీమ్ ఇదేనా! ద్రావిడ్ కోచింగ్‌లో టీమ్ పయనమెటు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఓటమి, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై విమర్శలు తెస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న రాహుల్ ద్రావిడ్ ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు...

Rahul Dravid
రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు సిరీస్ ఓడిన టీమిండియా, వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో పరాభవాలను చవిచూసిన భారత జట్టు, బంగ్లాదేశ్‌లోనూ వన్డే సిరీస్ కోల్పోయింది...
Rahul Dravid-Rohit Sharma
తాజాగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ టీమిండియాకి 209 పరుగుల తేడాతో భారీ ఓటమి ఎదురైంది. ముఖ్యంగా మొదటి రెండు రోజుల్లో టీమిండియా ఆడిన విధానం, అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది...
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ అవుటైన తర్వాత టీమిండియా ప్లేయర్లలో ఎనర్జీ ఏ మాత్రం కనిపించలేదు. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ భారీ భాగస్వామ్యం నిర్మిస్తుంటే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు బౌలర్లు కూడా వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపించలేదు...
Rahane-Ravi Shastri
రెండేళ్ల క్రితం విదేశాల్లో అద్భుత విజయాలు అందుకుని, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టీమ్స్‌కి చుక్కలు చూపించిన టీమ్ ఇదేనా... అనే అనుమానం కలుగుతోంది. దీంతో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి పేరు ట్రెండింగ్‌లో నిలిచింది...
2020 డిసెంబర్, ఆడిలైడ్ టెస్టులో టీమిండియా 36/9 పరుగులకే ఆలౌట్ అయ్యి, టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రదర్శన నమోదు చేసింది. ఈ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ కూడా స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే ఆడిలైడ్ పరాజయం తర్వాత భారత జట్టు ఊహించని కమ్‌బ్యాక్ ఇచ్చింది.
మెల్‌బోర్న్ టెస్టులో గెలిచి, సిడ్నీ టెస్టును డ్రా చేసుకుని... బ్రిస్బేన్‌లో 31 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకి పరాజయాన్ని రుచి చూపించింది. 2021 ఇంగ్లాండ్ పర్యటనలోనూ జో రూట్ టీమ్‌కి దడ పుట్టించింది టీమిండియా. లార్డ్స్‌లో అందుకున్న విజయం, చరిత్రలో అతి గొప్ప విజయాల్లో ఒకటి..
అలాంటి టీమ్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పూర్తిగా ఆసక్తి లేనట్టుగా ఆడింది. మరో రకంగా చెప్పాలంటే రవిశాస్త్రి కోచింగ్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా టీమ్‌లా ఛాంపియన్‌లా మిగిలిన టీమ్స్‌ని భయపెట్టింది. కానీ రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా మారాక మళ్లీ 1980ల్లో టీమిండియాలా మారిందని అంటున్నారు అభిమానులు...
రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ హయాలంలో ఐదేళ్ల పాటు టెస్టుల్లో నెం.1 టీమ్‌గా వెలుగొందింది భారత జట్టు. రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ హయంలో నెం.1 ర్యాంకు పోవడమే కాదు, గెలిచిన మ్యాచులన్నీ కూడా స్వదేశంలో వచ్చినవే...
స్వదేశంలో టెస్టులు గెలవడానికి రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ అవసరం. ఎన్నో దశాబ్దాలుగా స్వదేశంలో పుల్లుల్లా విజయాలు అందుకుంటూనే ఉంది టీమిండియా. రవిశాస్త్రి కోచింగ్‌లో విదేశాల్లో చూపించిన దూకుడే, రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో టీమ్‌లో కనిపించడం లేదు..
ఒక వికెట్ పడిన తర్వాత వెంటనే మరో ఒకటి రెండు వికెట్లు తీస్తే ఆస్ట్రేలియాకి ఇంత స్కోరు వచ్చేది కాదు. అయితే కొత్త బ్యాటర్ వచ్చిన తర్వాత కూడా భారత ప్లానింగ్‌లో ఎలా మార్పులు కనిపించలేదు. వాళ్లే అవుట్ అవుతారులే అన్నట్టుగా ఎంతో రిలాక్స్‌గా కనిపించింది టీమిండియా...
ఐసీసీ టైటల్ గెలిచినా గెలవకపోయినా కనీస పోరాటం చూపించినా టీమిండియాపై ఇన్ని విమర్శలు వచ్చేవి కావు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ విభాగాల్లో ఫెయిల్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగుల భారీ స్కోరు ఇచ్చిన భారత బౌలర్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ని ఆలౌట్ కూడా చేయలేకపోయారంటే... టీమిండియా పర్ఫామెన్స్ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 ఫైనల్‌లోనూ ఇదే రిజల్ట్ వచ్చింది. అయితే అక్కడ పరిస్థితి వేరు. టీమిండియాకి టాస్, వాతావరణం, పిచ్, పరిస్థితులు ఏదీ కలిసి రాలేదు. అన్నీ న్యూజిలాండ్‌కి అనుకూలంగా మారాయి. కానీ ఈసారి అలా కాదు. బ్యాటింగ్ పిచ్‌పై, మంచి వాతావరణ పరిస్థితులు, టాస్ కలిసి వచ్చినా టీమ్‌కి విజయం దక్కలేదు..
Image credit: Getty
‘వెళ్లి తగలబెడతా!’ అని హనుమంతుడు అంటే.. ‘హా.. వెళ్లి తగలబెట్టి, పూడ్చిరా.. ’ అని చెప్పే దూకుడైన కోచ్ రవిశాస్త్రి అయితే... ‘వెళ్లి చూసి వస్తా’ అంటే, ‘వద్దు, శాసనాల గ్రంథంలో రాసినదాని ప్రకారం ముందు వాళ్లే రావాలి...’ అని పద్ధతులు చెప్పే కోచ్ రాహుల్ ద్రావిడ్. ఇదే టీమ్ పర్ఫామెన్స్‌ని దెబ్బ తీస్తోందని అంటున్నారు అభిమానులు..