- Home
- Sports
- Cricket
- మ్యాక్స్‌వెల్‌ని ఇచ్చినందుకు థ్యాంక్స్... మీకు కూడా! ఆర్‌సీబీ, పంజాబ్ మధ్య ఇంట్రెస్టింగ్ చర్చ...
మ్యాక్స్‌వెల్‌ని ఇచ్చినందుకు థ్యాంక్స్... మీకు కూడా! ఆర్‌సీబీ, పంజాబ్ మధ్య ఇంట్రెస్టింగ్ చర్చ...
2020 సీజన్‌లో ఘోరంగా ఫెయిల్ అయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను, ఐపీఎల్ 2021 వేలంలో రూ.14 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్‌లో ఏమంత మెరుగైన రికార్డు లేని మ్యాక్స్‌వెల్‌కి ఇంత ధర పెట్టడంపై అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్... 2020 సీజన్‌లో 106 బంతులాడినా ఒక్క సిక్స్ కూడా బాదలేకపోయాడు మ్యాక్స్‌వెల్...

2020 సీజన్‌లో 13 మ్యాచులు ఆడినా ఒక్క సిక్స్ కొట్టలేకపోయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, 2021 సీజన్ మొదటి మ్యాచ్‌లో 100 మీటర్ల భారీ సిక్సర్ బాది, రికార్డు క్రియేట్ చేశాడు...

మ్యాక్స్‌వెల్ భారీ సిక్సర్ కొట్టిన తర్వాత ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్‌కి థ్యాక్స్ చెబుతూ ట్వీట్ చేసింది... ‘రెడ్ అండ్ గోల్డ్ జెర్సీలో ఫస్ట్ మ్యాక్సీ-మమ్... అతను కొట్టిన సిక్సర్, చెన్నై అవతల పడింది... థ్యాంక్యూ పంజాబ్ కింగ్స్, సోషల్ డిస్టెన్స్ లేకపోతే మిమ్మల్ని హగ్ చేసుకునేవాళ్లం’ అంటూ ట్వీట్ చేసింది రాయల్ ఛాలెంజర్స్...

ఆర్‌సీబీ ట్వీట్‌కి అంతే స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చిన పంజాబ్ కింగ్స్... ‘ఆ... క్రిస్ గేల్, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, మయాంక్ అగర్వాల్‌లను ఇచ్చినందుకు మీకు థ్యాంక్యూ...’ అంటూ కామెంట్ చేసింది పంజాబ్...

పంజాబ్ రిప్లైపై మళ్లీ స్పందించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ‘జెర్సీ కలర్, లోగో, హెల్మెట్స్, ప్యాడ్స్... మరిచిపోయినట్టున్నారు... మనం ఇలా ప్లేయర్లను మార్చుకుంటుంటే, వేరే జట్టు ట్రోఫీలు లెక్కబెట్టుకుంటోంది’ అంటూ రిప్లై ఇచ్చింది...

2021 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ ఆవిష్కరించిన కొత్త జెర్సీ, 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీకి కాపీలా ఉందన్న విమర్శలు వచ్చిన విషయం తెలిసందే...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్వీట్‌కి ‘అవును... రంగులను కనిపెట్టినందుకు థ్యాంక్యూ... మొదటి మ్యాచ్ విజయానికి అభినందనలు’ అంటూ రిప్లై ఇచ్చింది పంజాబ్ కింగ్స్...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్... రెండు జట్ల మధ్య సోషల్ మీడియాలో జరిగిన ట్వీట్ల వార్, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది...

‘గత సీజన్‌లో ఒక్క సిక్స్ బాదలేకపోయాను. ఈ సీజన్‌లో సిక్సర్ బాదడంతో రిలీఫ్ వచ్చినట్టుగా ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అప్పటికే బాగా ఆడుతుండడంతో నా పని తేలికైంది’ అంటూ కామెంట్ చేశాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్...