- Home
- Sports
- Cricket
- నిజమైన లీడర్‌కి కెప్టెన్సీ అవసరం లేదు, ఎమ్మెస్ ధోనీ కూడా అదే చేశాడు... - విరాట్ కోహ్లీ
నిజమైన లీడర్‌కి కెప్టెన్సీ అవసరం లేదు, ఎమ్మెస్ ధోనీ కూడా అదే చేశాడు... - విరాట్ కోహ్లీ
నాలుగు నెలల గ్యాప్‌లో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు విరాట్ కోహ్లీ. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు మూడు ఫార్మాట్లలో భారత కెప్టెన్‌గా ఉన్న విరాట్, సౌతాఫ్రికా టూర్ తర్వాత కేవలం బ్యాట్స్‌మెన్‌గా మిగిలిపోయాడు...

68 టెస్టుల్లో 40 విజయాలతో అత్యధిక టెస్టు విజయాలు అందించిన భారత సారథిగా నిలిచి, విదేశాల్లో టీమిండియాకి అసాధారణ విజయాలు అందించాడు విరాట్ కోహ్లీ...
టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన విరాట్ కోహ్లీ, ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...
‘ప్రతీదానికి ఎక్స్‌పైరీ పీరియడ్ ఉంటుంది, దాని కాలపరిమితి ముగిసిన తర్వాత తప్పుకోవాల్సిందే. మనం ఆ విషయాన్ని గ్రహించగలగాలి. చాలామంది విమర్శించడానికి సిద్ధంగా ఉంటారు...
ఇతను టీమ్‌కి ఏం చేశాడు? అని హేళనగా మాట్లాడుతూ ఉంటారు. అయితే అవన్నీ పట్టించుకోకుండా సాధించాల్సిన లక్ష్యాలపై ఫోకస్ పెడుతూ ముందుకు సాగిపోతూ ఉండాలి...
ఇప్పుడు ఓ బ్యాట్స్‌మెన్‌గా నా అవసరం టీమ్‌కి చాలా ఉంది. జట్టును గెలిపించే బాధ్యత ఉంది. ఆ బాధ్యతను సగర్వంగా తీసుకుంటా. లీడర్‌గా ఉండడానికి కెప్టెన్సీ అక్కర్లేదు...
ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత జట్టులో లీడర్‌గానే ఉన్నాడు. కెప్టెన్సీ తర్వాత కూడా జట్టుకి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తుండేవాడు... ఆయన కూడా తన కాలపరిమితి అయిపోయిందని గ్రహించి, జట్టు నుంచి తప్పుకున్నాడు...
నేను కూడా అలాగే ఎలాంటి వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకోకుండా జట్టును మరింత మెరుగ్గా చేయడానికే అహర్నిషలు కృషి చేశాను... నాయకత్వం నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకోవడం ప్రతీ ఒక్కరి వ్యక్తిగత విషయం...
వాతావరణం మారినప్పుడు ఓ కొత్త సారథి అవసరం ఉంటుంది. అయితే కెప్టెన్సీ మారి ఉండొచ్చు కానీ జట్టులో గెలవాలనే కసి మాత్రం మారు. భిన్నమైన ఆలోచనలతో భిన్నమైన పద్ధతిలో గెలవడానికే పోరాడుతాం...
ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో నేను చాలా కాలం ప్లేయర్‌గా ఆడాను, ఆ తర్వాత మాహీనే కెప్టెన్సీ చేశాను. అయితే నా మైండ్‌సెట్‌లో మాత్రం ఎప్పుడూ తేడా లేదు. ఇప్పుడు కూడా అంతే...
నేను ప్లేయర్‌గా ఉన్నా, కెప్టెన్‌గా ఫీల్ అవుతా... కెప్టెన్‌గా ఉన్నా, ఓ సాధారణ ప్లేయర్‌గానే ఆలోచిస్తా. నాకు కావాల్సిదల్లా జట్టు విజయమే. ఎందుకంటే నాకు నేనే లీడర్...’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ...