ఇలాగే ఆడాల్సింది ... ఇది టెస్టు క్రికెట్ అని గుర్తుంచుకోండి... మహ్మద్ కైఫ్ కౌంటర్...
First Published Jan 11, 2021, 9:52 AM IST
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలతో రాణించాడు ఛతేశ్వర్ పూజారా. అయితే మొదటి ఇన్నింగ్స్‌లో 174 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న ఛతేశ్వర్ పూజారా... టెస్టుల్లో తన స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును అధిగమించాడు. బ్యాటింగ్ పిచ్‌పై మరీ ఇంత జిడ్డాట ఆడుతుండడంతో ఛతేశ్వర్ పూజారాపై విమర్శల వర్షం కురిపించాడు కొందరు మాజీ క్రికెటర్లు, నెటిజన్లు.

పూజారా స్లో ఇన్నింగ్స్ డిఫెన్స్ కారణంగా నాన్ స్టైయికింగ్ బ్యాట్స్‌మెన్ ఒత్తిడిలోకి వెళుతున్నారని, టీమిండియా బ్యాటింగ్ ఫెయిల్యూర్‌కి ఇది కూడా ఓ కారణమని కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.

పూజారా డిఫెన్స్ చూస్తుంటే పరుగులు చేయడానికి ఆడుతున్నట్టు లేదని, అవుట్ అవుతానేమోననే భయంతో ఆడుతున్నట్టు ఉందని కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ క్రికెటర్ ఆలెన్ బోర్డర్ కామెంట్ చేశాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?