MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పాకిస్థాన్ టాప్ 5 రిచ్చెస్ట్ క్రికెటర్స్ ... వీళ్ల మొత్తం ఆస్తులు కలిపినా ఒక్క కోహ్లీతో సరితూగదు

పాకిస్థాన్ టాప్ 5 రిచ్చెస్ట్ క్రికెటర్స్ ... వీళ్ల మొత్తం ఆస్తులు కలిపినా ఒక్క కోహ్లీతో సరితూగదు

అంతర్జాతీయ క్రికెట్ లో రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ బిసిసిఐ. కేవలం బోర్డు మాత్రమే కాదు భారత క్రికెటర్లు కూడా బాగా రిచ్. పాకిస్థాన్ టాప్ 5 క్రికెటర్ల ఆస్తులను కలిపినా ఒక్క కోహ్లీ సంపాదించినదాంతో సరితూగదట... కోహ్లీ సంపాదన ఎంత? ఆ టాప్ 5 పాక్ క్రికెటర్లు ఎవరు? వారి సంపాదన ఎంత? తెలుసుకుందాం. 

3 Min read
Arun Kumar P
Published : Feb 27 2025, 01:48 PM IST| Updated : Feb 27 2025, 02:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Virat Kohli

Virat Kohli

Richest Pakistani Cricketers : క్రికెట్ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఇండియా. దేశప్రజలు క్రికెట్ ను ఎంతగానో ఇష్టపడతారు... ఆడేందుకే కాదు చూసేందుకు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. మనవాళ్లు క్రికెట్ ను ఎంతలా అభిమానిస్తారో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాళ్ళను దేవుడితో పోల్చడాన్నిబట్టే అర్థమవుతుంది. టీమిండియా క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు... ఇలా ఇప్పుడున్న ప్లేయర్స్ లో క్రికెట్ గాడ్ గా పేర్కొనదగ్గ ఆటగాడు విరాట్ కోహ్లీ. 

ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను మట్టికరిపించడంలో విరాట్ కోహ్లీ కీలకంగా వ్యవహరించారు. టీమిండియా బ్యాటింగ్ కు బ్యాక్ బోన్ గా నిలిచి అద్భుత సెంచరీ సాధించాడు. దీంతో దుబాయ్ వేదికగా తలపడ్డ దాయాదుల్లో విజయం మరోసారి టీమిండియానే వరించింది. ఈ సూపర్ ఇన్నింగ్స్ తో మరోసారి కోహ్లీ పేరు మారుమోగుతోంది. స్వయంగా పాకిస్థాన్ మాజీలే కోహ్లీ కొనియాడుతూ ఇతడితో ఏ పాక్ ఆటగాడిని సరిపోల్చలేమని చెబుతున్నారు.

ఇలా గతంలో పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ ను కోహ్లీకి పోటీ ఇస్తాడని అనేవారు. కానీ ఇప్పుడు కోహ్లీతో అసలు ఏ ఆటగాడిని పోల్చలేమని అంటున్నారు. కేవలం ఆటలోనే కాదు పేరు, గౌరవం చివరకు సంపాదనలోనూ పాక్ క్రికెటర్లకు అందనంత ఎత్తులో కోహ్లీ ఉన్నాడు. ఆసక్తికర విషయం ఏంటంటే టాప్ 5 ధనిక పాక్ క్రికెటర్ల ఆస్తులను కలిపినా కేవలం కోహ్తీ ఒక్కడి ఆస్తులతో సరితూగదు.  

ఇలా కోహ్లీ క్రికెట్ లోనే కాదు సంపాదనలోనూ టాప్ లో ఉన్నాడు. అతడి భార్య అనుష్క శర్మ కూడా బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ దంపతుల ఆస్తుల విలువ రూ.1300 నుండి రూ.1500 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఇందులో కోహ్లీ ఒక్కడే రూ.1000 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నాడు. ఇలా అంతర్జాతీయ క్రికెటర్లలో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్ళలో కోహ్లీ టాప్ లో ఉన్నాడు. ఆటలోనే కాదు సంపాదనలోనూ కోహ్లీ దరిదాపుల్లో ఏ ఒక్క పాకిస్థాన్ క్రికెటర్ లేడు.

24
Richest Pakistani Cricketers, Imran Khan

Richest Pakistani Cricketers, Imran Khan

టాప్ 5 రిచ్చెస్ట్ పాక్ క్రికెటర్లు వీళ్ళే :

1. ఇమ్రాన్ ఖాన్ : 

ఇతడు మాజీ క్రికెటర్ మాత్రమే కాదు పాకిస్థాన్ మాజీ ప్రధాని కూడా. చాలాకాలం పాకిస్థాన్ క్రికెట్ లో కొనసాగిన ఇమ్రాన్ ఖాన్ కొంతకాలం కెప్టెన్ గా కూడా వ్యవహరించారు. క్రికెటర్ గా రిటైర్ అయ్యాక సొంతగా పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీని పెట్టడమే కాదు గెలిచి ప్రధానిగా కూడా పనిచేసారు. ఇలా క్రికెటర్ గానే కాదు రాజకీయాల్లోనూ రాణించిన ఇమ్రాన్ భారీగా సంపాదించారు.

క్రికెటర్ గా, పాక్ ప్రధానిగా వ్యవహరించిన ఇమ్రాన్ ఖాన్ ఆస్తుల విలువ రూ.433 కోట్లు ఉంటుంది. ఇతడే పాక్ క్రికెటర్లలో అత్యంత ధనవంతుడు. అంటే పాకిస్థాన్ రిచెస్ట్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆస్తులు విరాట్ కోహ్లీ సంపాదనలో సగం కూడా లేవన్నమాట. 

34
Shahid Afridi, Shoiab Malik

Shahid Afridi, Shoiab Malik

2. షాహిద్ అఫ్రిది : 

పాకిస్థాన్ క్రికెట్ లో మంచి హిట్టర్ గా గుర్తింపుపొందాడు అఫ్రిది. అతడి ధనాధన్ ఇన్నింగ్స్ కు చాలామంది ఫ్యాన్స్ ఫిదా అయిపోయేవారు. ఈ మాజీ పాక్ ప్లేయర్ మంచి ఆటగాడే కాదు మంచి ఆస్తులను కూడా కలిగిఉన్నాడు. ఇతడివద్ద రూ.390 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. 

3. షోయబ్ మాలిక్ : 

ఇతడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మాత్రమే కాదు మన హైదరాబాద్ మాజీ అల్లుడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఇతడు పెళ్లాడాడు... వీరికి ఓ బాబు సంతానం. అయితే ఇటీవల వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.  

మాలిక్ వ్యక్తిగత విషయాలు పక్కనపెడితే అతడు ఆల్ రౌండ్ ప్రదర్శనతో పాక్ టీంలో చాలాకాలం ప్రధాన ఆటగాడిగా కొనసాగాడు. క్రికెట్ ద్వారానే కాకుండా యాడ్స్, ఇతర వ్యాపారాల ద్వారా కోట్లు సంపాదించాడు. మాలిక్ ఆస్తుల విలువు రూ.211 కోట్లవరకు ఉంటుంది. 
 

44
Mohammad Hafeez, Shoiab Akhtar

Mohammad Hafeez, Shoiab Akhtar

4. మహ్మద్ హఫీజ్ : 

పాకిస్థాన్ క్రికెట్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్. అతడు బ్యాట్ తోనే కాదు బాల్ తోనే అదరగొట్టేవాడు. అంతర్జాతీయ క్రికెటర్ గా కొనసాగిన అతడు రూ.199 కోట్ల విలువైన ఆస్తులు సంపాదించాడు. క్రికెటర్ గా రిటైర్ అయ్యాక కూడా అతడు బాగానే సంపాదించాడు. 

5. షోయబ్ అక్తర్ : 

పాకిస్థాన్ క్రికెట్ లో భయంకరమైన ఫాస్ట్ బౌలర్ గా షోయబ్ అక్తర్ కు పేరుండేది. అతడి బౌలింగ్ స్పీడ్ చూసి 'రావల్పిండి ఎక్స్ ప్రెస్' అని ముద్దుపేరుతో పిలుచుకునేవారు అభిమానులు. ఇలా క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్తర్ ఆస్తుల విలువ రూ.173 కోట్ల వరకు ఉంటుంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhigyan Kundu : వామ్మో ఏంటి కొట్టుడు.. IPL వేలానికి ముందు ఆసియా కప్‌లో డబుల్ సెంచరీ బాదిన తొలి భారత క్రికెటర్ !
Recommended image2
IPL Mini Auction 2026: మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టే ప్లేయ‌ర్స్ వీళ్లే... ఏకంగా రూ. 30 కోట్ల పైమాటే..
Recommended image3
IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved