- Home
- Sports
- Cricket
- ఉమెన్స్ క్రికెటర్లు అంతంత సంపాదిస్తారా..! టాప్ 5 రిచెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ వీళ్లే..!!
ఉమెన్స్ క్రికెటర్లు అంతంత సంపాదిస్తారా..! టాప్ 5 రిచెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ వీళ్లే..!!
Richest Indian Women Cricketers : ఇంతకాలం తెలీలేదుగానీ మెన్స్ క్రికెటర్ల స్థాయిలోనే ఉమెన్స్ క్రికెటర్లు కూడా రెండుచేతులా సంపాదిస్తున్నారు. టీమిండియా టాప్ ప్లేయర్స్ ఆస్తులు, ఆదాయాలు ఎలా ఉన్నాయంటే..

రిచెస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్
Richest Women Cricketers : క్రికెట్ అనగానే సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి మెన్స్ క్రికెటర్లే గుర్తుకువస్తారు… వీరి పేర్లే క్రికెట్ ఫ్యాన్స్ నోటివెంట ఎక్కువగా వినిపిస్తాయి. ఇది ఒకప్పటి మాట... ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ విజయం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన, జమీమా రోడ్రిగ్స్ వంటి ఉమెన్స్ క్రికెటర్లు కూడా ప్రజలకు పరిచయం అయ్యారు... వీరికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఈ క్రమంలో మహిళా క్రికెట్ గుర్తించి, టీమిండియా ఉమెన్ క్రికెటర్ల గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి భారత ఉమెన్స్ క్రికెటర్లలో అత్యధిక ఆదాయాన్ని పొందుతున్నవారు ఎవరో తెలుసుకుందాం.
1. మిథాలీ రాజ్
ఉమెన్స్ క్రికెట్ గురించి అవగాహన ఉన్నవారికి మిథాలీ రాజ్ తప్పకుండా పరిచయం ఉంటుంది. మహిళల క్రికెట్ కు ఏమాత్రం ఆదరణ లేని సమయంలో ఈమె ఎన్నో అద్భుత రికార్డులు సాధించింది... ప్రస్తుతం టీమిండియా వరల్డ్ కప్ సాధించే స్థాయికి చేరుకుందంటే అందుకు మిథాలీ వేసిన బలమైన పునాదులు కూడా కారణమే. అయితే తన ఆటతోనే కాదు ఆదాయంతోనూ అందరినీ ఆశ్చర్చపర్చింది మిథాలి. రాజస్థాన్ కు చెందిన ఈ మాజీ క్రికెటర్ మెన్స్ క్రికెటర్ల స్థాయిలో ఆస్తులను కలిగివుండి లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారు. ఈమె ఆస్తుల విలువ రూ.40 నుండి రూ.45 కోట్లు ఉంటుందని అంచనా.
క్రికెటర్ గా కంటే రిటైర్మెంట్ తర్వాతే మిథాలీ ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారట. క్రికెట్ వ్యాఖ్యాతగా, ఎండార్స్ మెంట్స్ తో పాటు వివిధ వ్యాపారాల ద్వారా మిథాలీకి ఆదాయం వస్తోంది. మొత్తంగా క్రికెట్ నుండి రిటైరైన తర్వాత కూడా మిథాలీ రాజ్ రిచెస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ గా కొనసాగుతున్నారు.
2. స్మృతి మంధాన
ఇండియా ఉమెన్స్ టీమ్ లో ప్రస్తుతం టాప్ ప్లేయర్ గా కొనసాగుతున్నారు స్మృతి మంధాన. తన ఆటతోనే కాదు అందంతోనూ అభిమానులను కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ మార్వాడీ కుటుంబంలో పుట్టిపెరిగిన మంధాన క్రికెటర్ గా రెండుచేతులా సంపాదిస్తోంది. ఈమె ఆస్తుల విలువ రూ.32 నుండి రూ.33 కోట్ల ఉంటుందని అంచనా. ఏడాదికి అంతర్జాతీయ క్రికెటర్ గా బిసిసిఐ నుండి రూ.50 లక్షలు, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నుండి రూ.3.4 కోట్లు వస్తాయి... వీటికి ఎండార్స్ మెంట్స్ ద్వారా వచ్చే ఆదాయం అదనం. ఎంత లేదనుకున్నా ఏడాదికి స్మృతి మంధాన ఆదాయం రూ.5 కోట్లకు పైనే ఉంటుంది.
3. హర్మన్ ప్రీత్ కౌర్
ఇండియా ఉమెన్స్ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతమైన క్రికెటర్. ఆమె సారథ్యంలో టీమిండియా మొదటిసారి ఐసిసి ప్రపంచకప్ సాధించింది. దీంతో ప్రస్తుతం ఈమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అయితే హర్మన్ కూడా రిచ్చెస్ట్ క్రికెటర్లలో ఒకరు... ఈమె ఆస్తుల విలువ రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
హర్మన్ ప్రీత్ కు బిసిసిఐ నుండి ఏటా రూ.50 లక్షలు లభిస్తాయి... అలాగే WPL లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న ఆమె రూ.1.8 కోట్లు పొందుతారు. ఎండార్స్ మెంట్స్ తో పాటు ఇతర మార్గాల్లోనూ ఆమెను ఆదాయం వస్తుంది. ప్రస్తుత వరల్డ్ కప్ విజయం తర్వాత హర్మన్ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది... దీంతో ఆమె ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
4. షెఫాలీ వర్మ
టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ కెరీర్ కేవలం 15 ఏళ్ల వయసులోనే మొదలయ్యింది... 2019 లో దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టారు. అద్బుతమైన ఆటతీరుతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు... ఇటీవల ఉమెన్స్ వరల్డ్ కప్ లో అదరగొట్టారు. క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న షఫాలీ ఆస్తుల విలువ సుమార్ రూ.11 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
5. దీప్తి శర్మ
ఉత్తర ప్రదేశ్ కు చెందిన దీప్తి శర్మ టీమిండియా ఆల్ రౌండర్. అటు బ్యాట్ తోనే కాదు ఇటు బౌలింగ్ తో అదరగొట్టగల క్రీడాకారిణి. ఈమె స్పోర్ట్ కోటాలో యూపీ పోలీస్ శాఖలో ఉన్నత ఉద్యోగాన్ని కూడా కలిగివున్నారు. WPL లో ఆమెకు యూపీ వారియర్స్ రూ.2.6 కోట్లు చెల్లిస్తుంది... బిసిసిఐ కూడా ఏడాదికి రూ.50 లక్షలు ఇస్తుంది. కొన్ని బ్రాండ్స్ కు ఈమె ఎండార్స్ మెంట్ చేస్తోంది. ఇలా అన్నిమార్గాల్లో కలిపి ఏడాది రూ.4 కోట్ల వరకు సంపాదిస్తుంది. దీప్తి శర్మ ఆస్తుల విలువ రూ.7 నుండి రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా.