గంభీర్ నుంచి ద్రావిడ్ వరకు.. అత్యధిక జీతం పొందిన టాప్ 5 టీమిండియా కోచ్‌లు
India Cricket Coach Salary: బీసీసీఐ చరిత్రలో అత్యధిక వేతనం పొందిన ఐదుగురు భారత క్రికెట్ కోచ్‌ల జాబితాలో గౌతమ్ గంభీర్ కూడా ఉన్నారు. ఈ లిస్టులోని వారి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియా కోచ్‌లకు భారీ వేతనాలు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డులలో ఒకటి. ఆటగాళ్లకు మాత్రమే కాకుండా జట్టుకు మార్గనిర్దేశం చేసే కోచ్‌లకు కూడా భారీ స్థాయిలో వేతనాలు చెల్లిస్తుంది. ఈ జాబితాలో గౌతమ్ గంభీర్ నుండి రాహుల్ ద్రావిడ్ వరకు పలువురు ప్రముఖులు ఉన్నారు. ఆ వివరాలు గమనిస్తే..
KNOW
గౌతమ్ గంభీర్
గౌతమ్ గంభీర్ ప్రస్తుతం భారత జట్టు హెడ్ కోచ్‌గా పనిచేస్తున్నారు. జూలై 2024లో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. నివేదికల ప్రకారం ఆయన సంవత్సరానికి సుమారు రూ. 14 కోట్ల వేతనం పొందుతున్నారు. దీనికి అదనంగా బోనస్‌లు, విదేశీ పర్యటనల ఖర్చులు కూడా వేరుగా ఇస్తారు.
రాహుల్ ద్రావిడ్
రాహుల్ ద్రావిడ్ నవంబర్ 2021లో భారత జట్టు హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. జూన్ 2024 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఆయన వార్షిక వేతనం సుమారు రూ. 12 కోట్లు. ద్రావిడ్ పదవీకాలంలో భారత జట్టు పలు సిరీస్‌లలో విజయాలు సాధించింది. ఆ సమయంలో భారత జట్టు అద్భుతమైన ప్రయాణం సాగించింది.
రవి శాస్త్రి
2017 నుండి 2021 వరకు భారత జట్టును నడిపించిన రవి శాస్త్రి.. బీసీసీఐ నుంచి అత్యధిక వేతనం పొందిన కోచ్‌లలో ఒకరు. ఆయన వార్షిక వేతనం రూ. 9.5 కోట్ల నుండి రూ. 10 కోట్ల వరకు ఉండేది. శాస్త్రి కోచింగ్‌లో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరుకుంది.
అనిల్ కుంబ్లే
అనిల్ కుంబ్లే ఒక సంవత్సరం మాత్రమే భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉన్నారు. 2016 నుండి 2017 మధ్య ఆయన పదవీకాలంలో బీసీసీఐ ఆయనకు రూ. 6.25 కోట్ల వార్షిక వేతనం చెల్లించింది. కుంబ్లే స్వల్ప కాలంలోనూ భారత జట్టును విజయాల దిశగా నడిపించారు.
డంకన్ ఫ్లెచర్
జింబాబ్వే మాజీ క్రికెటర్ డంకన్ ఫ్లెచర్, 2011 నుండి 2015 వరకు భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉన్నారు. ఆయనకు సంవత్సరానికి రూ. 4.2 కోట్ల వేతనం లభించేది. ఆయన కోచింగ్‌లో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
గౌతమ్ గంభీర్ నుండి ఫ్లెచర్ వరకు ఈ ఐదుగురు కోచ్‌లు భారత క్రికెట్ లో తమదైన ముద్ర వేశారు. బీసీసీఐ కోచ్‌లకు అందించే భారీ వేతనాలు, వారి బాధ్యతలకు ఉన్న ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.