- Home
- Sports
- Cricket
- 10 ఓవర్లు కట్! 40 ఓవర్ల ఫార్మాట్‌లో వన్డేలు.. షాహిదీ ఆఫ్రిదీ సలహాకి రవిశాస్త్రి మద్ధతు...
10 ఓవర్లు కట్! 40 ఓవర్ల ఫార్మాట్‌లో వన్డేలు.. షాహిదీ ఆఫ్రిదీ సలహాకి రవిశాస్త్రి మద్ధతు...
ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా ఆడిన వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా పూర్తిగా 50 ఓవర్ల పాటు సాగింది లేదు. రెండు మ్యాచుల్లో భారత జట్టు డామినేషన్ కనబరిస్తే, ఓ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో వన్డే ఫార్మాట్ మనుగడపై తీవ్రమైన చర్చ మొదలైంది...

వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్... వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకోవడం కూడా ఈ ఫార్మాట్‌కి తగ్గుతున్న ఆదరణని స్పష్టం చేసింది...
భారత క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా, భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా వన్డేలకు ఆదరణ కరువవుతున్న విషయాన్ని గుర్తించాల్సిందిగా వాపోయారు...
తాజాగా పాక్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీ, వన్డేలకు ఆదరణ పెరిగేందుకు ఈ ఫార్మాట్‌లో మార్పులు చేయాల్సిందిగా సూచించాడు. ‘ఇప్పుడు వన్డే క్రికెట్ చాలా బోరింగ్‌గా మారిపోయింది. దీన్ని 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి 40 ఓవర్ల ఫార్మాట్‌గా మారిస్తే కాస్త ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు షాహిద్ ఆఫ్రిదీ...
ఆఫ్రిదీ సలహాని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్వాగతించాడు. ‘గేమ్‌లో ఓవర్లు తగ్గించడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. ఇంతకుముందు వన్డేలు 60 ఓవర్ల పాటు సాగేవి, ఇప్పుడు 50 ఓవర్లకు వచ్చాయి...
Ravi Shastri and Virat Kohli
1983లో మేం వరల్డ్ కప్ గెలిచినప్పుడు వన్డే ఫార్మాట్‌లో 60 ఓవర్లు ఉండేది. 60 ఓవర్ల పాటు మ్యాచ్ సాగడాన్ని బోరింగ్‌గా ఉందని, అప్పుడు 60 నుంచి 50కి తగ్గించారు...
ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు 50 నుంచి 40కి తగ్గిస్తే తప్పేంటి? ఎందుకంటే కాలంతో పాటు మార్పులు చేసుకుంటేనే మనుగడ ఉంటుంది. చాలా ఏళ్లుగా వన్డేలు 50 ఓవర్ల ఫార్మాట్‌గానే సాగుతున్నాయి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి...