- Home
- Sports
- Cricket
- వన్డే వరల్డ్ కప్‌లో తిలక్ వర్మ!? ఆ ప్లేస్‌కి అతనే కరెక్ట్ అంటున్న అశ్విన్... రోహిత్ రియాక్షన్ ఏంటంటే...
వన్డే వరల్డ్ కప్‌లో తిలక్ వర్మ!? ఆ ప్లేస్‌కి అతనే కరెక్ట్ అంటున్న అశ్విన్... రోహిత్ రియాక్షన్ ఏంటంటే...
ఐపీఎల్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, మొదటి మూడు మ్యాచుల్లో అద్బుత ప్రదర్శన కనబర్చాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు తిలక్ వర్మ..

శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ గాయాలతో టీమ్‌కి దూరంగా ఉన్నారు. వీళ్లు కోలుకున్నారని బీసీసీఐ పెద్దలు చెబుతున్నా, ఇప్పటిదాకా వీరిద్దరూ వన్డే వరల్డ్ కప్ ఆడతారా? లేదా? అనే విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు...
Tilak Varma
20 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తిలక్ వర్మ, వెస్టిండీస్ టూర్‌లో చూపిస్తున్న పర్ఫామెన్స్‌కి భారత సీనియర్ క్రికెటర్లు, మాజీలు ఫిదా అయిపోయారు. అతనికి వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు ఉండాలని అంటున్నారు...
‘సంజూ శాంసన్, వన్డేల్లో బాగా ఆడుతున్నాడు. అలాగే తిలక్ వర్మ చూపించిన బ్యాక్ టు బ్యాక్ పర్ఫామెన్స్ అద్భుతం. అదీగాక అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. టీమిండియా ఎన్నో ఏళ్లుగా సరైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కోసం చూస్తోంది..
Tilak Varma
రవీంద్ర జడేజా రూపంలో టాప్ 7లో ఓ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉన్నాడు. ఇషాన్ కిషన్‌కి తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే. కాబట్టి తిలక్ వర్మను నాలుగో స్థానంలో ఆడిస్తే మంచి రిజల్ట్ వస్తుంది. అదీకాకుండా తిలక్ వర్మ, స్పిన్నర్లను చక్కగా ఆడతాడు..
లిస్ట్ ఏ క్రికెట్‌లో తిలక్ వర్మకు మంచి రికార్డు ఉంది. హైదరాబాద్ తరుపున అతను ఆడిన 25 లిస్టు ఏ మ్యాచుల్లో 56.18 సగటుతో 5 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు చేశాడు. అది కూడా 100కి పైగా స్ట్రైయిక్ రేటుతో... వరల్డ్ కప్‌కి బ్యాకప్ ప్లేయర్‌గా తిలక్ వర్మను సెలక్ట్ చేస్తే బాగుంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్..
‘శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా ఉన్నాడో లేదో ఇంకా తెలీదు. అతను ఫిట్‌గా లేకపోతే మాత్రం ఆ ప్లేస్‌కి తిలక్ వర్మ కరెక్టుగా సరిపోతాడు. ఎందుకంటే తిలక్ వర్మ, ఫాస్ట్ బౌలర్లను, స్పిన్ బౌలర్లను చక్కగా ఫేస్ చేయగలుగుతాడు.
Sanju Samson and Tilak Varma
అదీకాకుండా అవసరానికి తగ్గట్టుగా బ్యాటింగ్ స్టైల్ కూడా మార్చుకుంటాడు... టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో లెఫ్ట్ హ్యాండర్లు కూడా ఎక్కువ లేరు. తిలక్ వర్మను టీమ్‌లోకి తీసుకురావడానికి ఇంతకంటే ఏం కావాలి..’ అంటూ కామెంట్ చేశాడు మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్..
Tilak Varma
‘తిలక్ వర్మను రెండేళ్లుగా చూస్తున్నా. అతను బాగా ఆకలితో ఉన్నాడు. తిలక్ వయసుకి మించిన మెచ్యూరిటీతో ఆలోచిస్తున్నాడు, ఆటలోనూ మెచ్యూరిటీ చూపిస్తున్నాడు...
తిలక్ వర్మతో మాట్లాడినప్పుడు అతనికి బ్యాటింగ్ గురించి చాలా విషయాలు తెలుసని అర్థమైంది. ఎప్పుడు కొట్టాలి? ఎలా కొట్టాలి? అనే విషయాలపై పూర్తి అవగాహన ఉంది. వరల్డ్ కప్ టీమ్‌లో అతనికి చోటు ఉంటుందో లేదో తెలీదు. అయితే అతను ఫ్యూచర్‌లో టీమిండియాకి మంచి స్టార్ ప్లేయర్ అవుతాడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..