ఈసారి ఇండియాని ఓడించి తీరుతాం! రిషబ్ పంత్ లేకపోవడం మాకు అడ్వాంటేజ్... ఆసీస్ మాజీ కోచ్..
2004లో మొట్టమొదటిసారిగా భారత జట్టును స్వదేశంలో 2-1 తేడాతో ఓడించి టెస్టు సిరీస్ గెలిచింది ఆస్ట్రేలియా. ఆడమ్ గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీలో ఇండియాలో టెస్టు సిరీస్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు జస్టిన్ లాంగర్. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో జస్టిన్ లాంగర్, ఆసీస్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు...
Rishabh Pant Brisbane Test
ఆడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియాని చిత్తు చేసిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత మూడు టెస్టుల్లో రెండింట్లో ఓడింది. హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ వీరోచిత పోరాటంతో సిడ్నీ టెస్టుని డ్రా చేసుకున్న భారత జట్టు... మెల్‌బోర్న్‌లో, బ్రిస్బేన్‌లో ఘన విజయాలు అందుకుంది...
Umesh Yadav Injury
32 ఏళ్లుగా ఆస్ట్రేలియాకి అడ్డాగా మారిన బ్రిస్బేన్‌లో టీమిండియా గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కారణం సిడ్నీ టెస్టు ముగిసే సమయానికి భారత జట్టులో అరడజను ప్లేయర్లు గాయపడి, టీమ్‌కి దూరమయ్యారు. హనుమ విహారి, రవీంద్ర జడేజా, అశ్విన్, ఉమేశ్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, కెఎల్ రాహుల్... గాయాలతో టీమ్‌కి దూరమయ్యారు...
టి నటరాజన్, వాషింగ్టన్ సుందర్ బ్రిస్బేన్‌లో టెస్టు ఆరంగ్రేటం చేయగా శార్దూల్ ఠాకూర్ రీఎంట్రీ ఇచ్చాడు. ఈ ముగ్గురితో పాటు కుర్రాళ్లు రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్ వీరోచితంగా పోరాడి.. గబ్బాలో ఆస్ట్రేలియాకి 32 ఏళ్ల తర్వాత పరాజయాన్ని పరిచయం చేశారు...
రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి టీమ్‌కి దూరం కాగా, శార్దూల్ ఠాకూర్ పెద్దగా ఫామ్‌లో లేడు. ఆస్ట్రేలియా టూర్‌లో టీమ్‌ని నడిపించిన కెప్టెన్ అజింకా రహానే కూడా టీమ్‌లో చోటు కోల్పోయాడు. అప్పటి పూర్తి స్థాయి కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా టెస్టుల్లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు...
అన్నింటికీ తోడు అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా టీమ్‌లో లేడు. ఇవన్నీ కలిసి రావడంతో భారత పర్యటనలో టీమిండియాని ఓడించి టెస్టు సిరీస్ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు మాజీ ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్...
‘ఆస్ట్రేలియా టీమ్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉంది. టీమ్‌లో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. టీమిండియాలో రిషబ్ పంత్, అజింకా రహానే లేడు. ప్రస్తుతం విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియా, భారత జట్టును ఓడించగలదు. టీమిండియాని ఓడించడానికి ఇదే అతి పెద్ద ఛాన్స్...’ అంటూ వ్యాఖ్యానించాడు జస్టిన్ లాంగర్..