MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మ్యాచ్ అయ్యాక సరదాగా కబుర్లు చెప్పుకోకపోతే ఎలా? అశ్విన్ ‘కోలిగ్స్’ కామెంట్లపై సునీల్ గవాస్కర్...

మ్యాచ్ అయ్యాక సరదాగా కబుర్లు చెప్పుకోకపోతే ఎలా? అశ్విన్ ‘కోలిగ్స్’ కామెంట్లపై సునీల్ గవాస్కర్...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా తుది జట్టులో అశ్విన్‌కి చోటు లేకపోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని, ఇంకొందరికి అసహనాన్ని, మరికొందరికి లేనిపోని అనుమానాలను కలిగించింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమితో అశ్విన్‌ని తీసుకోకపోవడం వల్లేనని చాలామంది మాజీ క్రికెటర్లు కూడా వ్యాఖ్యానించారు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 11 2023, 05:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో చోటు దక్కించుకోలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్, ‘ఇంతకుముందు టీమ్‌లో అందరూ ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లు... ఇప్పుడు పరిస్థితి అలా లేదు, జస్ట్ కోలిగ్స్‌లా ఉంటున్నారంతే..’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

టీమిండియాలో ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయిందని, మన పని ఏంటి? అది చేశామా.. లేదా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, కనీసం పక్కనున్న ప్లేయర్ ఎలా ఉన్నాడు? ఏం ఆలోచిస్తున్నాడనే విషయాలను కూడా పట్టించుకోవడం లేదని రవిచంద్రన్ అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు. 

36
Team India

Team India

‘అశ్విన్ చేసిన కోలిగ్స్ కామెంట్లు నన్ను చాలా బాధపెట్టాయి. ఎందుకంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకోకపోతే ఎలా? క్రికెట్ గురించి కాకపోయినా మ్యూజిక్ గురించి, సినిమాల గురించి, రాజకీయాల గురించి.. ఏదో ఒకటి మాట్లాడుకోవాలి..
 

46

అలా మాట్లాడుకున్నప్పుడే ఆటలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మనసు రిలాక్స్ అవుతుంది. అనవసర ఆలోచనలతో అలిసిపోయిన మెదడు, కాస్త డైవర్ట్ అవుతుంది. ప్లేయర్ల మధ్య అనుబంధం పెరిగి, స్నేహంగా మారుతుంది.

56

మ్యాచ్ అయ్యాక జోకులు, నవ్వులు, అల్లర్లు, సరదాలు, స్నేహాలు... ఇవి చాలా కామన్ అవసరాలు.. నిజానికి ఇంతకుముందు ప్లేయర్లందరికీ ఒకే గదిలో పడేసేవాళ్లు. 20 ఏళ్లకి ముందు ఏ ఫారిన్ టూర్‌కి వెళ్లినా ప్లేయర్లు అంతా కలిసి ఉండాల్సిందే.

66

ఆ తర్వాత ప్లేయర్‌కో సింగిల్ గది ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ప్రతీ ప్లేయర్‌కి ఓ సెపరేట్ స్పెస్ ఉంటోంది. ఇది ప్లేయర్ల మధ్య అంతరం పెంచుతోంది..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..  

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ విధ్వంసం.. ఆ A సెలబ్రేషన్ సీక్రెట్ ఇదే బ్రో !
Recommended image2
Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు.. గేల్ రికార్డ్ ఇక అవుట్!
Recommended image3
IPL 2026: ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్స్ వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved