- Home
- Sports
- Cricket
- ఈ 60 ఓవర్లు, వాళ్లకి నరకం కనిపించాలి... ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కి ముందు విరాట్ స్పీచ్ వైరల్...
ఈ 60 ఓవర్లు, వాళ్లకి నరకం కనిపించాలి... ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కి ముందు విరాట్ స్పీచ్ వైరల్...
‘దాదా’ సౌరవ్ గంగూలీ తర్వాత టీమిండియాను నడిపించిన అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోనీ... ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ చాలా కూల్‌గా ఉండేవాళ్లు. వారి హయాంలో భారత జట్టు విజయాలు అందుకున్నా... విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా వరల్డ్ క్రికెట్‌లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది....

సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టులో ఎలాంటి దూకుడు కనిపించేదో, అంతకుమించిన ‘దూకుడు’ మంత్రం జపిస్తోంది విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో నవభారత్... సిడ్నీలో వచ్చిన చారిత్రక డ్రా అయినా, గబ్బాలో దక్కిన విజయం అయినా... తాజాగా లార్డ్స్‌లో దక్కిన విక్టరీ అయినా ఆ కోవకు చెందినవే...
గంగూలీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టులో గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ వంటి ఒకరిద్దరు దూకుడైన ప్లేయర్లు ఉంటే... ఇప్పుడు కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టులో ప్రతీ ఒక్కరిలోనూ ఈ యాటిట్యూడ్ స్పష్టంగా కనిపిస్తోంది...
లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఒక్కో వికెట్ పడుతున్నప్పుడు ఆవేశపరుడిగా ముద్రపడిన మహ్మద్ సిరాజ్‌తో పాటు రోహిత్ శర్మ, అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా కూడా ఆవేశంగా ముందుకొచ్చి ఊగిపోతూ సెలబ్రేట్ చేసుకున్నారు....
దీనికంతటికీ జస్ప్రిత్ బుమ్రాను ఇంగ్లాండ్ టీమ్ టార్గెట్ చేయడమే కావచ్చు, అయితే దానికి రివెంజ్ తీర్చుకోవాలనే ఆలోచన మాత్రం విరాట్ కోహ్లీ నుంచే వచ్చింది... పెవిలియన్ నుంచే బుమ్రాను ఎలా టార్గెట్ చేసింది చూస్తూ, ఆగ్రహానికి గురైన కోహ్లీ... అక్కడి నుంచే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు...
ఇంతకుముందు కూడా భారత క్రికెటర్లను టార్గెట్ చేస్తూ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి టీమ్‌లు కొన్ని పన్నాగాలు చేశాయి. అయితే అలాంటి సందర్భాల్లో ఆ క్రికెటర్ మాత్రమే ప్రతీకారం తీర్చుకునేవాడు...
కోహ్లీ కెప్టెన్సీలో 2007లో యువీని, అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ సెడ్జింగ్ చేయడంతో దానికి బ్యాటుతోనే సమాధానం చెప్పాడు యువరాజ్. అయితే ఇప్పుడు రివెంజ్ ప్లాన్ పూర్తిగా మారిపోయింది...
కెఎల్ రాహుల్ ‘మాలో ఒక్కడిని మీరు టార్గెట్ చేస్తే, మేమంతా కలిసి మీదపడిపోతాం...’ అని చెప్పినట్టుగా బుమ్రాకి జరిగిన అనుభవానికి అతని కంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ రగిలిపోయారు... అది ఆఖరి రోజు ఆటలో స్పష్టంగా కనిపించింది...
లంచ్ సెషన్ తర్వాత 9 బంతులు ఆడిన తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది టీమిండియా. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌కి వచ్చే ముందు విరాట్ కోహ్లీ, టీమ్ మేట్స్‌కి ఇచ్చి లఘు స్వీచ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది...
స్టేడియంలో ప్రేక్షకుల అరుపులతో విరాట్ కోహ్లీ ఏం మాట్లాడింది... పూర్తిగా వినిపించకపోయినా... ‘ఈ 60 ఓవర్లలో వారికి నరకం కనిపించాలి...’ అంటూ చెప్పిన మాటలు మాత్రం స్పష్టంగా వినిపించాయి...
లేటుగా డిక్లేర్ చేయడం, 60 ఓవర్లలో 10 వికెట్లు తీయాల్సి రావడంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అనుకున్నారంతా. అయితే అన్యూహ్యంగా అదరగొట్టిన భారత బౌలర్లు... 52 ఓవర్లలోనే ఇంగ్లాండ్ కథ ముగించేశారు...