- Home
- Sports
- Cricket
- వాళ్లేం స్కూల్ పిల్లలు కాదు, కోట్లు తీసుకున్నారు... టీమిండియా బౌలర్లపై రవిశాస్త్రి ఫైర్...
వాళ్లేం స్కూల్ పిల్లలు కాదు, కోట్లు తీసుకున్నారు... టీమిండియా బౌలర్లపై రవిశాస్త్రి ఫైర్...
టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవిలో ఉన్నంత కాలం భారత ఫాస్ట్ బౌలింగ్‌లో స్వర్ణ యుగమే నడిచింది. ఇషాంత్ శర్మ,ఉమేశ్ యాదవ్, బుమ్రా, భువీ, షమీ, శార్దూల్, సైనీ, నటరాజన్, సిరాజ్... ఇలా భారత ఫాస్ట్ బౌలర్లు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ దేశాల్లో చుక్కలు చూపించగలిగారు. వరల్డ్ క్లాస్ బౌలింగ్ యూనిట్ కలిగిన దేశంగా టీమిండియా ఎదిగింది...

రవిశాస్త్రి రిటైర్మెంట్ తర్వాత రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలను తీసుకున్నాడు. ద్రావిడ్ వచ్చిన తర్వాత భారత బౌలింగ్ తేలిపోవడం మొదలైంది. బుమ్రా, ఇషాంత్, షమీ, ఉమేశ్ యాదవ్ వంటి సీనియర్లు లేకుండా గబ్బాలో ఆస్ట్రేలియాని ఆలౌట్ చేసిన భారత బౌలర్లు... సౌతాఫ్రికాలో అందరూ ఉన్నా వికెట్లు తీయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది..
Image credit: Getty
అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీతో పాటు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ భారత బౌలర్లు ఫెయిల్ అయ్యారు. కీలక మ్యాచుల్లో చేతులు ఎత్తేసి భారత జట్టు పరాజయానికి కారణమయ్యారు.
‘మ్యాన్ మేనేజ్‌మెంట్... ఏ టీమ్ సక్సెస్‌కైనా కీ.. వాళ్లు స్కూల్ పిల్లలు కాదు. ఒక్కో ప్లేయర్ కోట్లు సంపాదిస్తున్నారు. మిలియనీర్లతో ఆడించాలంటే వాళ్ల మైండ్‌సెట్‌ని చదవగలగాలి. ఒక్కో ప్లేయర్ ఒక్కో మైండ్‌సెట్‌తో ఉంటాడు. వాళ్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం...
Bhuvi
భారత ఫాస్ట్ బౌలర్లే కాదు, స్పిన్ బౌలర్లు కూడా సరిగ్గా రాణించలేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాళ్లతో వీలైనంత ఎక్కువ సమయం మాట్లాడండి. గ్రూప్‌గా మాట్లాడండి. ఒక్కోక్కరితో వేర్వేరుగా మాట్లాడండి. అనుభవం అనేది మార్కెట్లో కొనుక్కుంటే వచ్చేది కాదు...
Harshal Patel
భారత బౌలర్లకు ఎంతో అనుభవం ఉంది. మిగిలిన జట్లలో ఉన్న బౌలర్ల కంటే మన బౌలర్ల అనుభవం చాలా ఎక్కువ. దాన్ని ఎలా వాడాలో వారికి గుర్తు చేయాలి.. ఇప్పుడు క్రికెటర్లకు ఫిట్‌నెస్ చాలా కీలకంగా మారిపోయింది.
మా టైంలో క్రికెటర్లకు యో యో టెస్టు మాత్రమే ఉండేది. చాలామంది దీన్ని చూసి నవ్వేవాళ్లు. అది టీమ్ సెలక్షన్ గురించి పెట్టింది, ఫిట్‌నెస్ అవగాహన కల్పించాలని నామమాత్రంగా పెట్టింది మాత్రమే... అయితే అది చాలా తేడాని తీసుకొచ్చింది...
ఎలా ఆడాలో మాత్రమే కాదు ఫీల్డ్‌లో ఎలా కదలాలో కూడా ముఖ్యమని నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పడానికి యోయో టెస్టు బాగా ఉపయోగపడుతోంది. గత కొన్ని నెలల్లో భారత బౌలర్లు ఎన్నిసార్లు ప్రత్యర్థులకు 200+ స్కోరు అప్పగించారు...
Image credit: PTI
భారత బౌలింగ్ మాత్రమే కాదు, ఫీల్డింగ్ కూడా నాసిరకంగా ఉంటోంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీ గెలవాలంటే అన్నింట్లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. ఇక్కడ లోపాలతో ఉన్న జట్లు గెలవలేవు...’’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...