MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • ఎలుకల్ని ఈజీగా పట్టేయొచ్చు కానీ వాళ్లిద్దరూ చిరుత పులులు... సచిన్, ద్రావిడ్‌పై పాక్ మాజీ బౌలర్...

ఎలుకల్ని ఈజీగా పట్టేయొచ్చు కానీ వాళ్లిద్దరూ చిరుత పులులు... సచిన్, ద్రావిడ్‌పై పాక్ మాజీ బౌలర్...

ఇండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఆ రేంజ్ వేరే లెవెల్. అయితే ఇరుదేశాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో దశాబ్ద కాలంగా ఇండియా- పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు. ఐసీసీ టోర్నీల కారణంగా వన్డే, టీ20ల్లో ఇండో పాక్ ఫైట్ చూసే అవకాశం దొరుకుతున్నా, టెస్టు మ్యాచులు జరగక చాలా ఏళ్లు అవుతోంది..  

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 27 2023, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పాకిస్తాన్‌ ప్రధానంగా భీకరమైన ఫాస్ట్ బౌలర్లకు పుట్టినిల్లు. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్‌తో పాటు షోయబ్ అక్తర్, మహ్మద్ అసిఫ్ వంటి ఫాస్ట్ బౌలర్లు, ప్రపంచ బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టారు. పాక్ నుంచి కొందరు స్పిన్నర్లు కూడా టాప్ క్లాస్ పర్పామెన్స్ ఇచ్చారు. అయితే పాక్ స్పిన్ బౌలింగ్ యూనిట్‌పై చాలాసార్లు పైచేయి సాధించారు భారత బ్యాట్స్‌మెన్... పాక్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్, భారత బ్యాటర్లకు బౌలింగ్ చేయడానికి తెగ ఇబ్బంది పడ్డాడట...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

‘సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్.. ఇద్దరూ ఇద్దరే... టెస్టుల్లో ఈ ఇద్దరికీ చాలా సార్లు అవుట్ చేశాను. అయితే ఓ ఎలుకను పట్టుకోవడానికి, ఓ పులిని పట్టుకోవడానికి చాలా తేడా ఉంటుంది. ఎలుక, బోనులో ఎర వేస్తే దొరికిపోతుంది. కానీ పులి అలా కాదు.. ఈ బ్యాటర్లను ఎలుకలా పట్టుకోలేం..

37

సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్‌లను అవుట్ చేయడానికి గంటల కొద్దీ శ్రమించాల్సి వచ్చేది. కొన్నిసార్లు 20 ఓవర్లు వేస్తాను, మరికొన్నిసార్లు అంతకంటే ఎక్కువ ఓవర్లే బౌలింగ్ చేశాను.. వారికి ఆటను అర్థం చేసుకోవడం, చదవడం బాగా తెలుసు..

47

అందుకే సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ ఇద్దరూ కూడా వరల్డ్ క్లాస్ బ్యాటర్లు అయ్యారు. ఎంతో ఓపిగ్గా ఉంటూ రకరకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తే కానీ వారి వికెట్ దక్కేది కాదు. కొన్నిసార్లు మొదటి ఓవర్లలోనే వికెట్ దక్కినా అది అదృష్టమే..

57

నేను బౌలింగ్‌కి వస్తున్నానని తెలిస్తే అజయ్ జడేజా ముఖం వాడిపోయేది. నాకు బాగా గుర్తు, జడేజా ఎప్పుడూ కూడా నా బౌలింగ్‌లో పూర్తి ఓవర్ ఆడలేదు. నా బౌలింగ్‌లో ప్రతీసారీ అవుట్ అయ్యేవాడు. నాతో కూడా ఈ విషయం చాలా సార్లు చెప్పాడు..
 

67

కానీ సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ చాలా డేంజరస్ బ్యాటర్లు. వాళ్లను అవుట్ చేయడం చాలా కష్టమైన విషయం.. ’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్..

77
Sachin Tendulkar, Saqlain Mushtaq

Sachin Tendulkar, Saqlain Mushtaq

పాకిస్తాన్ తరుపున 49 టెస్టులు, 169 వన్డేలు ఆడిన సక్లైన్ ముస్తాన్, 496 అంతర్జాతీయ వికెట్లు తీశాడు. 19 సార్లు ఐదేసి వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved