- Home
- Sports
- Cricket
- తెల్లతోలు సెలక్టర్లు, తెల్లోళ్లనే సెలక్ట్ చేస్తారు... ఆస్ట్రేలియాలో వర్ణ వివక్షపై ఉస్మాన్ ఖవాజా...
తెల్లతోలు సెలక్టర్లు, తెల్లోళ్లనే సెలక్ట్ చేస్తారు... ఆస్ట్రేలియాలో వర్ణ వివక్షపై ఉస్మాన్ ఖవాజా...
జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌లో కుల, మత, వర్ణ వివక్షలకు తావులేదు. అయితే సౌతాఫ్రికా క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించిన వర్ణ వివక్ష ఇప్పుడు ఆస్ట్రేలియాని తాకింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ సెలక్టర్లపై సంచలన ఆరోపణలు చేశాడు...

సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో 195 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. టెస్టు కెరీర్‌లో మొట్టమొదటి టెస్టు డబుల్ సెంచరీని 5 పరుగుల తేడాతో మిస్ చేసుకున్న ఖవాజా... క్రికెట్ ఆస్ట్రేలియాపై సంచలన ఆరోపణలు చేశాడు..
Usman Khawaja
‘నేను టీమ్‌లో చోటు దక్కించుకోవడానికి ఎంతగానో కష్టపడాల్సి వచ్చింది. ‘చూడండి.. మీరు ఎంతో ఖర్చు పెడుతున్నారు. అయితే రావాల్సిన ఛాన్సులు రావడం లేదు, 10 ఏళ్లుగా కష్టపడుతున్నా మార్పు మాత్రం కనిపించడం లేదు... అని క్రికెట్ ఆస్ట్రేలియా చెబుతూ వచ్చింది...
క్రికెట్ ఆస్ట్రేలియాలో కనిపించకుండా పక్షపాతం, వివక్ష ఉన్నాయి. క్రికెట్ టీమ్‌లోకి వచ్చాక తెల్ల క్రికెటర్, నల్ల (బ్రౌన్)క్రికెటర్ ఇద్దరూ ఒకటే. అయితే వైట్ కోచ్, వైట్ క్రికెటర్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తాడు...
అలాగే తెల్ల సెలక్టర్లు, తెల్ల తోలు క్రికెటర్లనే సెలక్ట్ చేస్తారు. ఎందుకంటే వారి బిడ్డలు ఇలా తెల్లగానే కనిపిస్తారు కాబట్టి. మనవాళ్లు కారనుకున్నవారిని టీమ్‌కి సెలక్ట్ చేయాలంటే వారికి మనసొప్పదు...
Usman Khawaja
గత ఏడాది టీమ్ హోటల్‌లో నన్ను మూడుసార్లు అడ్డుకున్నారు. నా దగ్గర ఆస్ట్రేలియా కిట్ ఉన్నా, ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌తోనే ఉన్నా ఐడీ చూపించాల్సిందిగా కోరారు. తెల్ల క్రికెటర్లకు ఇలాంటి ఇబ్బందులు ఉండవు..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఉస్మాన్ ఖవాజా...
పాకిస్తాన్‌లో జన్మించిన ఉస్మాన్ ఖవాజా, చిన్నతనంలోనే సిడ్నీకి వెళ్లాడు. ఆస్ట్రేలియా తరుపున 56 టెస్టులు, 40 వన్డేలు, 9 టీ20 మ్యాచులు ఆడిన ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ కంటే ముందుగానే అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసినా అతని కంటే తక్కువ మ్యాచులు ఆడానని ప్రత్యేక్షంగానే వ్యాఖ్యలు చేశాడు..