- Home
- Sports
- Cricket
- టీమిండియాలో భయపెట్టే బౌలర్ లేడు! ఎంత మంది ఉండి ఏం లాభం.. - పాక్ ఓపెనర్ షాకింగ్ కామెంట్స్...
టీమిండియాలో భయపెట్టే బౌలర్ లేడు! ఎంత మంది ఉండి ఏం లాభం.. - పాక్ ఓపెనర్ షాకింగ్ కామెంట్స్...
ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్‌పై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది టీమిండియా. అయితే 2021 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న పాక్, ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్‌పై మొట్టమొదటి విజయం అందుకుంది...

Ahmed Shehzad
ఆసియా కప్ 2022 టోర్నీలోనూ భారత జట్టును ఓడించిన పాకిస్తాన్, వచ్చే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ ఈ ఫీట్ రిపీట్ చేయాలని అనుకుంటోంది. తాజాగా పాక్ ఓపెనర్ అహ్మద్ షాజద్, టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు..
‘టీమిండియా అంటే నాకు చాలా గౌరవం, వారిని అవమానించడం నా ఉద్దేశం కాదు కానీ ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టే బౌలర్, ఆ టీమ్‌లో ఎవరైనా ఉన్నారో చెప్పండి. బుమ్రా, జడేజా, అశ్విన్ మంచి బౌలర్లే కానీ డేంజరస్ బౌలర్లు అయితే కాదు..
షోయబ్ అక్తర్ బౌలింగ్‌కి వస్తే బ్యాటర్లు భయపడేవాళ్లు. అతన్ని ఎదుర్కోవడానికి చాలా ఇబ్బందిపడేవాళ్లు. నేను టీమ్‌లోకి వచ్చిన కొత్తలో షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో చుక్కలు చూశాను. అక్తర్ నాకు వేసిన 8 బంతులు కూడా రివర్స్ స్వింగ్ అయ్యాయి..
<p>Shoaib Akhtar</p>
చాలా తక్కువ మందికి మాత్రమే అలాంటి గొప్ప క్వాలిటీ ఉంటుంది. నెట్స్‌లో అక్తర్ ఎప్పుడూ నో బాల్స్ వేయడు. అంతేకాదు బౌన్సర్లు కూడా వేయడు. తన తోటి టీమ్ మేట్స్ గాయపడకుండా జాగ్రత్తగా బౌలింగ్ చేసేవాడు..
అంతర్జాతీయ మ్యాచుల్లో బౌలింగ్ చేసినట్టు చేసి ఉంటే మేం ఆసుపత్రిలోనే ఎక్కువ ఉండేవాళ్లం. ఎందుకంటే అక్తర్ బౌలింగ్ ఫేస్ చేయడానికి అంతర్జాతీయ బ్యాటర్లు మాత్రమే కాదు, నెట్స్‌లో మేం కూడా భయపడేవాళ్లం..
Image credit: Getty
టీమిండియాలో భయంకర బౌలర్లు లేకపోయినా బ్యాటర్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఉన్నారు. అయితే కేవలం బ్యాటర్లతోనే మ్యాచులు గెలవడం చాలా కష్టం..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ ఓపెనర్ అహ్మద్ షాజద్..