- Home
- Sports
- Cricket
- అప్పుడు సచిన్ టెండూల్కర్, ఇప్పుడు విరాట్ కోహ్లీ సేమ్ టు సేమ్... మధ్యలో సౌరవ్ గంగూలీ...
అప్పుడు సచిన్ టెండూల్కర్, ఇప్పుడు విరాట్ కోహ్లీ సేమ్ టు సేమ్... మధ్యలో సౌరవ్ గంగూలీ...
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ... ఈ ఇద్దరికీ చాలా విషయాల్లో చాలా పోలికలు ఉన్నాయి. సచిన్ క్రియేట్ చేసిన రికార్డులే లక్ష్యంగా దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ, కెప్టెన్సీ విషయంలో ‘మాస్టర్’ కంటే బెటర్ అనిపించాడు. అయితే విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించబడడంతో సచిన్ టెండూల్కర్ పాత కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..

మహ్మద్ అజారుద్దీన్ నుంచి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న సచిన్ టెండూల్కర్, భారత జట్టుకి చెప్పుకోదగ్గ విజయాలు అందించలేకపోయాడు...
కెప్టెన్‌గా ఉన్న సమయంలో బ్యాట్స్‌మెన్‌గా సూపర్ సక్సెస్ అవుతూ, పరుగులు సాధించినా... టీమ్ నుంచి సచిన్ టెండూల్కర్‌కి ఎలాంటి సహకారం అందేది కాదు. బౌలర్లు, మిగిలిన బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యేవాళ్లు...
ఈ సమయంలోనే సచిన్ టెండూల్కర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఈ విషయం సచిన్ టెండూల్కర్‌కి కూడా చెప్పకపోవడం అప్పట్లో చాలా పెద్ద చర్చనీయాంశమైంది...
‘బీసీసీఐ మేనేజ్‌మెంట్‌కి ఎవ్వరూ నాకు ఫోన్ చేయలేదు, కెప్టెన్‌గా తొలగించినట్టు చెప్పలేదు. మీడియా వాళ్లు ఫోన్ చేసి, ఈ విషయాన్ని అడగడంతో షాక్ అయ్యాను. కెప్టెన్సీ నుంచి తప్పించినందుకు ఫీల్ అవ్వలేదు కానీ, ఆ విషయం నాకు చెప్పకపోవడమే చాలా బాధపెట్టింది. బయటి నుంచి ఈ వార్త వినడం అవమానంగా అనిపించింది...’ అంటూ కామెంట్ చేశాడు సచిన్ టెండూల్కర్...
ఇప్పుడు విరాట్ కోహ్లీ చేసిన కామెంట్లు కూడా ఇంచుమించు ఇలాంటివే. ‘అధికారిక ప్రకటన చేయడానికి గంటన్నర ముందు నాకు ఫోన్ చేసి, టెస్టు టీమ్ సెలక్షన్ గురించి చర్చించారు. సెలక్షన్ చర్చలు ముగిసిన తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు తెలిపారు. నేను ఒకే అన్నాను...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
అప్పుడు సచిన్ టెండూల్కర్ అయినా, ఇప్పుడు విరాట్ కోహ్లీ అయినా టీమిండియాకి టన్నుల కొద్ది పరుగులు చేసి, ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించినవాళ్లే. అయితే ఈ ఇద్దరి స్టార్‌డమ్, క్రేజ్, రేంజ్... భారత క్రికెట్ బోర్డు కంటే పెద్దది...
అందుకే వారి క్రేజ్‌ను తగ్గించడానికి అప్పుడు, ఇప్పుడు అలాంటి అవమానాలే చేసింది బీసీసీఐ. భారత క్రికెట్ కంటే సచిన్ టెండూల్కర్ కానీ, విరాట్ కోహ్లీ కానీ ఎవరూ ఎక్కువ కాదనడంలో తప్పులేదు. కానీ బోర్డు పెద్దలు, ప్లేయర్లు కాదని నిరూపించడం కోసం ఇలా అవమానించడం మాత్రం సరికాదు...
బీసీసీఐ బాస్‌గా జగన్మోహన్ దాల్మియా ఉన్నప్పుడు టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏం చేసినా చెల్లింది, అయితే దాల్మియా పదవీకాలం ముగిసిన తర్వాత గంగూలీ, జట్టుకి దూరమై కష్టకాలన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది...
కొన్నేళ్ల పాటు సింగిల్ హాఫ్ సెంచరీ కూడా లేకుండా, సింగిల్ డిజిట్స్ స్కోర్లతోనే కెప్టెన్‌గా కొనసాగుతూ వచ్చాడు గంగూలీ. దాదాతో పోలిస్తే విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌లోనూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నట్టే లెక్క...
దాల్మియా తప్పకున్న తర్వాత సౌరవ్ గంగూలీ అటు కెప్టెన్సీ కోల్పోయి, ఇటు టీమ్‌లో ప్లేస్ కోల్పోయి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది... ఆ విషయం బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మరిచిపోయినట్టు లేదు...
అందుకే అనిల్ కుంబ్లే హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడానికి కారణమైన విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తప్పించి, తన అధికారాన్ని చూపించుకుంటున్నాడని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...