- Home
- Sports
- Cricket
- సచిన్ టెండూల్కర్‌ను దాటేసిన జో రూట్... యాషెస్ సిరీస్‌లోనూ విరాట్ కోహ్లీ ప్రస్తావన...
సచిన్ టెండూల్కర్‌ను దాటేసిన జో రూట్... యాషెస్ సిరీస్‌లోనూ విరాట్ కోహ్లీ ప్రస్తావన...
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కి ఉండే క్రేజే వేరు. గబ్బాలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి, ఆస్ట్రేలియా విజయం అందుకోగా, ఆడిలైడ్‌లో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులోనూ ఆసీస్ ఆధిపత్యం కనబరుస్తోంది...

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 473 పరుగుల భారీ స్కోరు చేసి, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. డేవిడ్ వార్నర్ 167 బంతుల్లో 11 ఫోర్లతో 95 పరుగులు చేసి, వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ మార్కు మిస్ అయ్యాడు...
ఈ మ్యాచ్ ద్వారా తిరిగి ఆసీస్ కెప్టెన్‌గా తాత్కాలిక బాధ్యతలు తీసుకున్న స్టీవ్ స్మిత్ 201 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 93 పరుగులు చేసి 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు...
మార్నస్ లబుషేన్ 305 బంతుల్లో 8 ఫోర్లతో 103 పరుగులు చేయగా, అలెక్స్ క్యారీ51, నేసెర్ 35, మిచెల్ స్టార్క్ 39 పరుగులు చేశాడు... పింక్ బాల్ టెస్టుల్లో లబుషేన్‌కి ఇది మూడో సెంచరీ. డే నైట్ టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా టాప్‌లో నిలిచాడు లబుషేన్..
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ 3 వికెట్లు తీయగా, జేమ్స్ అండర్సన్‌కి 2 వికెట్లు దక్కాయి. ట్రావిస్ హెడ్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన జో రూట్, ఈ ఏడాది 12 వికెట్లు తీశాడు.. అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియాపై జో రూట్ ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన విషయం తెలిసిందే.
ఇంగ్లాండ్‌కి తొలి ఇన్నింగ్స్ ఆరంభంలో గట్టి షాక్ తగిలింది. రోరీ బర్న్స్ 4, హసీబ్ హమీద్ 6 పరుగులు చేసి అవుట్ కావడంతో 12 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయి కష్టాల్లో పడింది ఇంగ్లాండ్...
అయితే జో రూట్, డేవిడ్ మలాన్ కలిసి మూడో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లాండ్‌ను ఆదుకున్నారు. ఈ దశలో 40+ పరుగులు చేసిన జో రూట్, ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు...
2010లో సచిన్ టెండూల్కర్, టెస్టుల్లో 1562 పరుగులు చేయగా, 1979లో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ 1549 పరుగులు చేశాడు. ఈ ఇద్దరినీ అధిగమించిన జో రూట్, మైకెల్ క్లార్క్ 2012లో చేసిన 1595 పరుగులను దాటేశాడు...
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ 2006లో ఒకే ఏడాదిలో 1788 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన టెస్టు ప్లేయర్‌గా టాప్‌లో ఉండగా, 1976లో 1710 పరుగులు చేసిన విండీస్ దిగ్గజం వీవ్ రిచర్డ్స్ రెండో స్థానంలో ఉన్నాడు..
2008లో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్స్ స్మిత్, 1656 పరుగులు చేసి టాప 3లో ఉన్నాడు. జో రూట్ రెండు భారీ శతకాలతో చెలరేగితే, మహ్మద్ యూసఫ్ రికార్డును కూడా బ్రేక్ చేసేందుకు అవకాశం ఉంటుంది...
టెస్టుల్లో 9406+ పైగా పరుగులు చేసిన జో రూట్, ప్రస్తుత తరంలో అత్యధిక టెస్టు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా టాప్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 7801 టెస్టు పరుగులతో రెండో స్థానంలో ఉండగా, స్టీవ్ స్మిత్ 7645 పరుగులతో టాప్ 3లో ఉన్నాడు...
యాషెస్ సిరీస్ జరుగుతున్న సమయంలో ఇంగ్లాండ్ కామెంటేటర్ల మధ్య విరాట్ కోహ్లీ ప్రస్తావన రావడం విశేషం. ‘విరాట్ కోహ్లీ ఆటంటే మాకు ఎంతో ఇష్టం. అతను నేటి తరంలో ఓ గొప్ప క్రికెటర్. వరల్డ్ క్రికెట్‌లో విరాట్ ఓ సూపర్ స్టార్’ అంటూ కామెంట్ చేశారు యాషెస్ కామెంటేటర్లు...