MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Sports
  • Cricket
  • టెంబా బావుమా సరికొత్త చరిత్ర.. 74 సంవత్సరాల తర్వాత ప్రపంచంలోనే తొలి ప్లేయర్ గా రికార్డ్

టెంబా బావుమా సరికొత్త చరిత్ర.. 74 సంవత్సరాల తర్వాత ప్రపంచంలోనే తొలి ప్లేయర్ గా రికార్డ్

Temba Bavuma Creates History: 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) లో దక్షిణాఫ్రికా జట్టును ఫైనల్ వరకు నడిపించి సరికొత్త రికార్డు సాధించాడు ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 09 2025, 02:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Temba Bavuma Creates History: కేప్ టౌన్‌లోని  న్యూలాండ్స్ స్టేడియంలో జరిగిన న్యూ ఇయర్ టెస్టులో దక్షిణాఫ్రికా 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి 2-0తో సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. దీంతో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా క్రికెట్ ప్రపంచంలో సరి కొత్త రికార్డు తన పేరు మీద లిఖించుకున్నాడు.

సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో రెండు వికెట్ల తేడాతో స్వల్ప విజయంతో, దక్షిణాఫ్రికా 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో తమ స్థానాన్ని ఖరారు చేసుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో జూన్ 11-15 తేదీలలో లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో సౌత్ ఆఫ్రికా తలపడునుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Temba Bavuma

Temba Bavuma

టెంబా బావుమా చరిత్ర సృష్టించాడు

టెస్ట్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా టెంబా బావుమా అద్భుతమైన రికార్డును సాధించాడు. 34 ఏళ్ల అతను తన కెరీర్‌లో తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లలో ప్రోటీస్‌ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు. వాటిలో ఎనిమిది మ్యాచ్‌లను ఒక డ్రాతో గెలుచుకున్నాడు.

దీంతో టెస్ట్ క్రికెట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ రెండో కెప్టెన్ గా టెంబా బావుమా గెలిచాడు. ఆడిన టెస్టులు గెలిచిన మ్యాచ్ ల వివరాలను గమనిస్తే 74 ఏళ్లలో అత్యుత్తమం, టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండవది. ఇంగ్లండ్‌కు చెందిన పెర్సీ చాప్‌మన్ (1921) మాత్రమే తొమ్మిది మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలతో మెరుగైన ఆరంభాన్ని అందించాడు.

35

ఆసీస్ దిగ్గజాలను సమం చేసిన టెంబా బావుమా

దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా ఆస్ట్రేలియా ద్వయం వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (1921), లిండ్సే హాసెట్ (1951) లను సమం చేశాడు. వీరు తొమ్మిది మ్యాచ్‌లలో ఎనిమిది విజయాలు సాధించారు. టెస్టు మ్యాచ్‌లో ఓడిపోకుండా అత్యధిక విజయాలు సాధించిన టెస్టు కెప్టెన్‌గా ఆర్మ్‌స్ట్రాంగ్ ప్రపంచ రికార్డును బావుమా సమం చేశాడు.

45

ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా టెస్ట్ కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్లు:

1. వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (ఆస్ట్రేలియా)    
2. టెంబావ్ బావుమా (దక్షిణాఫ్రికా)
3. బ్రియాన్ క్లోజ్ (ఇంగ్లండ్)    
4. చార్లెస్ ఫ్రై (ఇంగ్లండ్)
5. అజింక్యా రహానే (భారత్)

55
Temba Bavuma

Temba Bavuma

మరో అద్భుత రికార్డుకు చేరువగా బావుమా

2025 WTC ఫైనల్‌లో బావుమా ఆర్మ్‌స్ట్రాంగ్‌ను అధిగమించి, ఒక టెస్టులో ఓడిపోకుండా తొమ్మిది విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచే అవకాశం ఉంది. అయితే, యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో  2025 WTC ఫైనల్‌ కు ముందు ప్రోటీస్ ఐర్లాండ్ లేదా ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ ఆడవచ్చని దక్షిణాఫ్రికాకు చెందిన షుక్రీ కాన్రాడ్ తెలిపాడు.

ఇది లార్డ్స్‌లో షోడౌన్‌కు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్‌కు రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని ఇస్తుంది. బావుమా కెప్టెన్‌గా తన తదుపరి రెండు మ్యాచ్‌లను గెలవగలిగితే, బావుమా చరిత్రలో అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్సీగా రికార్డు సృష్టిస్తాడు. అలాగే, క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 10 విజయాలు సాధించిన కెప్టెన్‌గా కూడా నిలుస్తాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Tallest Cricketers : అత్యంత పొడగరి ఇండియన్ క్రికెటర్ ఇతడే... హైట్ ఎంతో తెలుసా?
Recommended image2
KL Rahul Love Story: బెంగళూరులో సీక్రెట్ మీటింగ్ నుంచి ఖండాలా పెళ్లి వరకు.. కేఎల్ రాహుల్ - అథియా శెట్టి లవ్ స్టోరీ ఇదే
Recommended image3
AUS vs BAN: 149 ఏళ్ల టెస్ట్ హిస్టరీలో బిగ్గెస్ట్ సంచలనం.. ఆస్ట్రేలియాకు సొంతగడ్డపైనే షాకిచ్చిన బంగ్లాదేశ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved