ఐపీఎల్‌లో తెలుగు ప్లేయర్లకు మళ్లీ అన్యాయం... సన్‌రైజర్స్‌ నుంచి మన కుర్రాళ్లు అవుట్...

First Published Jan 21, 2021, 12:22 PM IST

యువ క్రికెటర్లలో దాగి ఉన్న సత్తాను బయటికి తీసుకురావడమే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముఖ్య ఉద్దేశం. సత్తా ఉన్న యువ క్రికెటర్ల కోసం కోట్లు కుమ్మరించడానికి కూడా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు వెనుకాడవు. అయితే ఐపీఎల్‌లో కూడా తెలుగు కుర్రాళ్లకు పెద్దగా గుర్తింపు దక్కడం లేదు. 2008 నుంచి ఇప్పటిదాకా జరిగిన సీజన్లలో ఒక్క అంబటిరాయుడు, మహ్మద్ సిరాజ్ తప్ప, మరో తెలుగు క్రికెటర్‌కి పెద్దగా అవకాశాలు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు...