రిషబ్ పంత్ ప్లేస్‌కి చెక్ పెడుతున్న అక్షర్ పటేల్... ఇలాగైతే మనోడి సీటు గల్లంతే...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ప్రధాన వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు రిషబ్ పంత్. అయితే ఇప్పటిదాకా జరిగిన తొలి రెండు మ్యాచుల్లో రిషబ్ పంత్‌కి తుది జట్టులో కూడా చోటు దక్కలేదు.పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్‌ని, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కొనసాగించింది టీమిండియా...
Image credit: PTI
పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్ బౌలింగ్ చేసి 21 పరుగులు ఇచ్చిన అక్షర్ పటేల్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు అక్షర్ పటేల్...
Axar Patel
‘నన్ను ఐదో స్థానంలో బ్యాటింగ్ పంపాలనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమేమీ కాదు. పాకిస్తాన్ టీమ్‌లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ ఉన్నాడు. అలాగే లెఫ్ట్ స్పిన్నర్ షాదబ్ ఖాన్ కూడా వారికి చాలా కీ బౌలర్లు...
మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లపైనే ఆధారపడతారు. నాకు టీమ్ మేనేజ్‌మెంట్ ముందుగానే ఈ విషయం చెప్పింది. భారత టాపార్డర్‌లో ఆరుగురు రైట్ హ్యాండెడ్ బ్యాటర్లు ఉన్నారు. కాబట్టి అవసరమైతే బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ వస్తుందని, రెఢీగా ఉండాలని సూచించారు...
Image credit: PTI
ప్రాక్టీస్ గేముల్లో కూడా నాకు అదే రోల్ ఇచ్చారు. అందులో నేను బాగానే ఆడాను. అందుకే పాక్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ దక్కింది. అయితే రనౌట్ అవ్వడం కాస్త నిరాశకు గురి చేసింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌కి ఉపయోగించిన స్పిన్ చాలా భిన్నమైంది...
Image credit: PTI
మా కంటే ముందు అదే పిచ్‌పై మరో మ్యాచ్ జరిగింది. కాబట్టి పిచ్ పూర్తి డ్రైగా మారిపోయింది. అందుకే బంతి ఆగి ఆగి వస్తుంది. ఇలాంటి పిచ్ మీద లైన్ అండ్ లెంగ్త్ ఫాలో అయితే వికెట్ దక్కదు. అయితే కాస్త భిన్నంగా ప్రయత్నించాలని అనుకున్నా. ఫలితం వచ్చింది...’ అంటూ కామెంట్ చేశాడు అక్షర్ పటేల్...
Rishabh Pant-Rohit Sharma
అక్షర్ పటేల్ కామెంట్లను బట్టి చూస్తుంటే రిషబ్ పంత్‌ని ఇప్పట్లో వాడే అవకాశం కనిపించడం లేదు. పాక్‌తో మ్యాచ్‌లో నిరాశపరిచిన దినేశ్ కార్తీక్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి కూడా రాలేదు. అయితే వికెట్ల వెనకాల దినేశ్ కార్తీక్ కీపింగ్ టీమిండియాకి చాలా ఉపయోగపడుతోంది...
దినేశ్ కార్తీక్‌కి గాయమైతే, లేదా అతనికి రెస్ట్ ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించినప్పుడు రిషబ్ పంత్‌కి తుది జట్టులో అవకాశం దక్కొచ్చు. అలాగే ప్రధాన స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. అక్షర్ పటేల్, అశ్విన్‌లలో ఒకరికి రెస్ట్ ఇస్తేనే చాహాల్ టీమ్‌కి వస్తాడు...