- Home
- Sports
- Cricket
- క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఓపెనర్... 31 ఏళ్ల వయసులో వనీతా వెల్లస్వామి...
క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఓపెనర్... 31 ఏళ్ల వయసులో వనీతా వెల్లస్వామి...
31 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన వనీతా వెల్లస్వామి... టీమిండియా తరుపున 22 మ్యాచులు ఆడిన వనీత...

టీమిండియా పురుషుల జట్టుకి ఉన్న ఫాలోయింగ్ మహిళా క్రికెటర్లకు ఉండదు. స్మృతి మంధాన, మిథాలీరాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ వంటి కొందరు ప్లేయర్ల పేర్లు విన్నా, చాలామంది ప్లేయర్ల గురించి క్రికెట్ ఫ్యాన్స్‌కి తెలీదు. అలా పెద్దగా గుర్తింపు తెచ్చుకోని భారత మహిళా క్రికెటర్ వెల్లస్వామి వనీత...
కర్ణాటక జట్టుకి ఓపెనర్‌గా వ్యవహరించిన వనీత, టీమిండియా తరుపున 16 వన్డేలు ఆడి 216 పరుగులు చేసింది. అలాగే 6 టీ20 మ్యాచుల్లో 85 పరుగులు చేసింది...
2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వన్డే ఆరంగ్రేటం చేసిన వనీత, అదే జట్టుపై టీ20ల్లోనూ అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసింది...
చివరిగా 2014 నవంబర్‌లో సౌతాఫ్రికాపై వన్డే మ్యాచ్ ఆడిన వనీత, 2016 నవంబర్‌లో వెస్టిండీస్‌పై ఆఖరి టీ20 మ్యాచ్ ఆడింది...
స్మృతి మంధాన, సఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ వంటి యంగ్ ప్లేయర్ల ఎంట్రీ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్న వనీత, 31 ఏళ్ల వయసులో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించింది.
కొన్నాళ్ల కిందట బీచ్‌లో బికినీలో అందాల ఒంపులను చూపిస్తూ వనీత పోస్టు చేసిన ఫోటో, అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మోడల్‌కి తక్కువ కాకుండా రెచ్చిపోయిన ఈ మహిళా క్రికెటర్... కొన్నిరోజులకి ఆ ఫోటోలను డిలీట్ చేసింది...
19 ఏళ్ల క్రితం తాను క్రికెట్ ఆడడం మొదలెట్టానని, ఆ పసి ప్రాయంలోనే ఆటను ఎంతగానో ప్రేమించానని చెప్పిన వనీత, తాను బతికి ఉన్నంతవరకూ ఆటను ప్రేమిస్తూనే ఉంటానని రాసుకొచ్చింది...
తన క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొన్నానని చెప్పిన వనీత, భారత జట్టుకు ఆడడాన్ని తనకి దక్కిన అతి గొప్ప గౌరవంగా భావిస్తున్నానంటూ రాసుకొచ్చింది...
వనీత రిటైర్మెంట్‌పై భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి స్పందించింది. ‘ఐ విల్ మిస్ యూ వాణి. 2005లో మనం కలిసి ఆడిన మొదటి మ్యాచ్ నుంచి 2021 వరకూ ప్రతీ మూమెంట్‌ను ఎంజాయ్ చేశా... గ్రేట్ జర్నీ’ అంటూ కామెంట్ చేసింది వేదా కృష్ణమూర్తి.