- Home
- Sports
- Cricket
- అంతా పంత్ మయం... భారత వికెట్ కీపర్‌కి బాగా అచ్చొచ్చిన 2022! సెంచరీలతో పాటు డకౌట్లు కూడా...
అంతా పంత్ మయం... భారత వికెట్ కీపర్‌కి బాగా అచ్చొచ్చిన 2022! సెంచరీలతో పాటు డకౌట్లు కూడా...
రిషబ్ పంత్... టీమిండియాలోకి ఓ సంచలనంలా ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్. ఆరంభంలో అదరగొట్టినా ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్‌తో మూడు ఫార్మాట్లలోనూ జట్టుకి దూరమయ్యాడు రిషబ్ పంత్. అయితే 2020 ఐపీఎల్ తర్వాత రిషబ్ పంత్ కెరీర్ గ్రాఫ్ యేటికేటికీ పైపైకి దూసుకుపోతోంది...

2020 ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో మూడు టెస్టులు ఆడి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలచిన రిషబ్ పంత్, బ్రిస్బేన్ టెస్టులో అద్వితీయమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టుకి విజయాన్ని అందించి... సూపర్ స్టార్‌గా మారిపోయాడు...
ఆ ఇన్నింగ్స్ తర్వాత మూడు ఫార్మాట్లలోనూ రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, 2021 ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో అనుకోకుండా వచ్చినా కెప్టెన్సీ ఛాన్సుని చక్కగా వాడుకున్న రిషబ్ పంత్, టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసులో నిలిచాడు...
2022 ఏడాది అయితే మొత్తం రిషబ్ పంత్ హవానే నడుస్తోంది. 2022లో కేప్‌టౌన్ టెస్టులో సెంచరీ చేసిన రిషబ్ పంత్, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులోనూ అద్భుత సెంచరీతో చెలరేగాడు...
Rishabh Pant
కెఎల్ రాహుల్ గాయపడడంతో అనుకోకుండా టీమిండియా కెప్టెన్సీ దక్కించుకున్న రిషబ్ పంత్, సౌతాఫ్రికాపై స్వదేశంలో రెండు టీ20 మ్యాచులు గెలిచిన భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ మినహా ఎవ్వరూ సౌతాఫ్రికాపై స్వదేశంలో ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవలేకపోయారు..
ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో శతకాన్ని అందుకుని, వన్డేల్లో మొట్టమొదటి సెంచరీ నమోదు చేసిన రిషబ్ పంత్... ఈ ఏడాది భారత జట్టు తరుపున అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు, అత్యధిక ఫోర్లు, అత్యధిక సిక్సర్లు, అత్యధిక డకౌట్లు... ఇలా ప్రతీదానిలోనూ టాప్‌లో నిలిచాడు...
ఈ ఏడాది ఐదు టెస్టులు ఆడిన రిషబ్ పంత్, రెండు సెంచరీలతో 532 పరుగులు చేసి టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు... టెస్టుల్లో మరే భారత ప్లేయర్, రిషబ్ పంత్‌కి దగ్గర్లో కూడా లేరు..
అలాగే 9 వన్డేల్లో ఓ సెంచరీతో 311 పరుగులు చేసిన రిషబ్ పంత్, 2022లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. టీ20ల్లో పాటు రిషబ్ పంత్ కంటే ఇషాన్ కిషన్ ఎక్కువ పరుగులు చేశాడు...
Image credit: PTI
అయితే ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో భారత జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన రిషబ్ పంత్, వికెట్ కీపర్‌గా అత్యధిక క్యాచులు, అత్యధిక స్టంపౌట్లు చేసి... టాప్‌లో నిలిచాడు. చూస్తుంటే ఈ ఏడాది ‘అంతా పంత్ మయం...’ అయ్యేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...