విహారి స్థానంలో రవీంద్ర జడేజా... తెలుగోడి స్థానానికి చెక్ పడినట్లేనా...

First Published Dec 22, 2020, 10:48 AM IST

మొదటి టెస్టులో ఘోర పరాభవం తర్వాత టీమిండియాలో కీలక మార్పులు జరగబోతున్నట్టు తెలుస్తోంది. తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన ప్లేయర్లకు, రెండో ఛాన్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదు బీసీసీఐ. అందుకే మెల్‌బోర్న్‌లో జరగబోయే రెండో టెస్టుకి వ్యూహరచన చేస్తోంది భారత జట్టు. మొదట టెస్టులో విఫలమైన తెలుగు తేజం హనుమ విహారికి రెండో టెస్టు తుది జట్టులో చోటు ఉండకపోవచ్చని సమాచారం...

మొదటి టెస్టు మ్యాచు మూడు రోజుల్లోనే ముగిసింది. దీంతో మిగిలిన రెండు రోజులు జట్టుకి మోటివేషనల్ క్లాసులు జరిగాయట.

తొలి టెస్టులో ఘోర పరాభవం నుంచి తేరుకుని రెండో టెస్టుకి సిద్ధమయ్యేందుకు అవసరమైన కీలక వ్యూహాలకు కూడా ఈ రెండు రోజుల్లో చర్చలు జరిగాయి...

వన్డేలు, మొదటి టీ20 మ్యాచ్‌లో బ్యాటుతో కూడా రాణించిన రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తేవాలని భావిస్తోంది బీసీసీఐ...

మొదటి టెస్టులో విఫలమైన హనుమ విహారి స్థానంలో రవీంద్ర జడేజాను ఆడించాలని భావిస్తోంది టీమిండియా...

తొలి టెస్టులో కేవలం నలుగురు బౌలర్లలో బరిలో దిగింది టీమిండియా. అయితే సుదీర్ఘ బ్యాటింగ్ లైనప్ భారత జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు...

రహానే, విహారి, సాహాతో కూడిన మిడిల్ ఆర్డర్, అశ్విన్, ఉమేశ్ యాదవ్, బుమ్రా, షమీలతో కూడా లోయర్ ఆర్డర్ పెద్దగా పరుగులు చేయలేకపోయింది...

దీంతో విహారి స్థానంలో రవీంద్ర జడేజాను ఆడిస్తే, టీమిండియాకు రెండు రకాలుగా కలిసొచ్చే అవకాశం ఉంటుందని టీమిండియా ప్లాన్...

జడేజా బౌలింగ్ చేయగలడు, బ్యాటింగ్‌లోనూ రాణించగలడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ లైనప్‌లో ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉండడం వల్ల లోయర్ ఆర్డర్‌లో వారికి కీలకమైన పరుగులు వచ్చాయి.

అయితే రవీంద్ర జడేజా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నా... మ్యాచ్‌కి ఇంకా నాలుగు రోజులే ఉండడంతో అప్పటికి జడ్డూ నూరు శాతం ఫిట్‌నెస్ సాధిస్తాడా? అనేది తేలాల్సి ఉంది.

ఒకవేళ బాక్సింగ్ డే టెస్టు నాటికి రవీంద్ర జడేజా ఫిట్‌నెస్ సాధిస్తే, హనుమ విహారికి జట్టులో చోటు పోయినట్టే. లేదా తెలుగు కుర్రాడికి తన సత్తా నిరూపించుకునేందుకు మరో ఛాన్స్ లభిస్తుంది.

ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న హనుమ విహారి... మరో ఛాన్స్ ఇస్తే జట్టులో తన ప్రాధాన్యం ఏంటో నిరూపించుకోగలడు. జడేజా తుది జట్టులోకి వచ్చినా విహారికి కూడా అవకాశం ఇవ్వాలని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?